Mahesh Babu: అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మహేష్.. కేక పెట్టిస్తున్నాడుగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మహేష్ సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో మహేష్ ఎలా కనిపిస్తాడనే ఆసక్తికి ఆయన భార్య నమ్రతా తెరదించారు. త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాలో మహేష్ మరోసారి తన లుక్‌ను మార్చాడు. తాజాగా ఆయన అల్ట్రా స్టైలిష్ మోడ్‌లో సరికొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు.

Mahesh Babu: అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మహేష్.. కేక పెట్టిస్తున్నాడుగా!

Mahesh Babu In Ultra Stylish Look For Trivikram Movie

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మహేష్ సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగించుకున్న చిత్ర యూనిట్, రెగ్యులర్ షూటింగ్‌ను నేటి నుండి ప్రారంభించారు. ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేసినట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ సినిమాలో మహేష్ ఎలా కనిపిస్తాడనే ఆసక్తికి ఆయన భార్య నమ్రతా తెరదించారు.

Trivikram Mahesh Babu Movie: అలా ఆ టీమ్‌ను మళ్లీ వాడుతున్న త్రివిక్రమ్..?

త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాలో మహేష్ మరోసారి తన లుక్‌ను మార్చాడు. తాజాగా ఆయన అల్ట్రా స్టైలిష్ మోడ్‌లో సరికొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోను నమ్రతా తన ఇన్‌స్టా పేజీలో షేర్ చేసింది. ఈ ఫోటోకు ‘వర్క్ మోడ్ ఆన్’ అంటూ క్యాప్షన్ ఇవ్వగా సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్-మహేష్ కాంబోలో రాబోయే ఈ సినిమాతో వారి కాంబినేషన్ ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుందని అభిమానులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Mahesh Babu : మహేష్ బాబు.. షర్ట్ లేకుండా మొదటిసారి.. స్విమ్మింగ్ ఫూల్ లో..

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలుపెడుతున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో మహేష్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 28, 2023లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)