రొమాంటిక్ రిషిని చూసారా?

మహర్షి నుండి న్యూ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

  • Published By: sekhar ,Published On : February 4, 2019 / 06:11 AM IST
రొమాంటిక్ రిషిని చూసారా?

మహర్షి నుండి న్యూ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా, మహర్షి.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీ దత్, పీవీపీ, దిల్ రాజు నిర్మిస్తుండగా, అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్‌గా, పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేసిన సెకండ్ లుక్‌లో.. సూటూ, బూటు గెటప్‌లో అదరగొట్టేసాడు సూపర్ స్టార్. రీసెంట్‌గా మహర్షి నుండి మరో న్యూ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇప్పటి వరకు సోలోగా సందడి చేసిన మహేష్, ఈ లుక్‌లో హీరోయిన్ పూజాహెగ్డేతో కలిసి కనిపించాడు. పూజా, మహేష్‌ని గాఢంగా కౌగలించుకోగా, మహేష్ కూడా ఆమెని రెండు చేతులతో పట్టుకుని ఉన్నాడు ఈ పోస్టర్‌లో..

లొకేషన్ చూస్తుంటే నర్సరీ వాతావరణంలా ఉంది.. ఈ సినిమాలో మహేష్, స్టూడెంట్‌గా, రైతుగా, సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న మహర్షి, ఏప్రిల్‌ 25న రిలీజ్ కానుంది.

వాచ్ పోస్టర్…