Mahesh Babu: ఫ్యామిలీతో మెమరబుల్ మూమెంట్స్.. మహేష్ బర్త్ డే స్పెషల్!

సూపర్ స్టార్ మ‌హేష్‌.. తెలుగు ప్రజలకు ఈ పేరుకి పెద్ద‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోస్‌లలో ఒక‌రిగా ఉన్న మ‌హేష్ అనేక రికార్డుల‌ని సృష్టించి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచాడు. కృష్ణ వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని బాల‌న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ హీరోగా అనేక బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు సాధించాడు.. ఇంకా సాధిస్తాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో రాబోతున్న మహేష్ నేడు 46వ బ‌ర్త్ డే జరుపుకుంటున్నాడు.

Mahesh Babu: ఫ్యామిలీతో మెమరబుల్ మూమెంట్స్.. మహేష్ బర్త్ డే స్పెషల్!

Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ మ‌హేష్‌.. తెలుగు ప్రజలకు ఈ పేరుకి పెద్ద‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోస్‌లలో ఒక‌రిగా ఉన్న మ‌హేష్ అనేక రికార్డుల‌ని సృష్టించి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచాడు.

View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

కృష్ణ వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని బాల‌న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ హీరోగా అనేక బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు సాధించాడు.. ఇంకా సాధిస్తాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో రాబోతున్న మహేష్ నేడు 46వ బ‌ర్త్ డే జరుపుకుంటున్నాడు.


అయితే.. 46 జస్ట్ నెంబర్ మాత్రమే అనేలా మహేష్ తాజాగా విడుదల చేసిన ఫోటోలలో మైమరపించాడు. షూటింగ్స్‌తో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే మహేశ్‌కు ఏ మాత్రం తీరిక దొరికినా కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే.


కాస్త గ్యాప్ దొరికితే భార్య పిల్లలతో కలిసి విదేశాలకు ఎగిరిపోయి మహేష్ ఇంట్లో ఉన్నా పిల్లలతో పిల్లాడిలా మారి అల్లరి చేసేస్తుంటాడు. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ క్యూట్ ఫ్యామిలీ మెమరబుల్ మూమెంట్స్ అభిమానులకు చేరుతున్నాయి.


మహేష్ సినిమాల గురించే కాదు.. పిల్లలు, వారి అల్లరి, అనుబంధాన్ని కూడా నమ్రతా, సితార సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.