Mahesh Babu: నయా లుక్‌లో మహేష్ సెన్సేషన్.. సినిమా కోసం కాదు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Mahesh Babu: నయా లుక్‌లో మహేష్ సెన్సేషన్.. సినిమా కోసం కాదు!

Mahesh Babu New Look For Ad Goes Viral

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మహేష్ ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అయితే ఈ సినిమా షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు మహేష్.

Mahesh Babu: మహేష్ కోసం లైగర్ పాపను రంగంలోకి దించుతున్న త్రివిక్రమ్

కాగా, ఈ గ్యాప్‌లో మహేష్ పలు యాడ్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ యాడ్ కోసం మహేష్ సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాడు. చింపిరి జుట్టుతో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మహేష్ కనిపించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌ను ఈ సరికొత్త లుక్‌లో కనిపించేలా చేశాడు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హాకిమ్. అయితే, మహేష్ బాబు ఈ లుక్ కేవలం యాడ్ కోసమేనా, లేక సినిమాలో కూడా ఉంటుందా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Mahesh Babu: సూపర్ స్టార్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటో!

ఏదేమైనా మహేష్ బాబు తన నయా లుక్‌తో ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలను సైతం అవాక్కయ్యేలా చేశాడు. ఇక మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రంలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.