Sarkaru Vaari Paata: పంచులతో పిచ్చెక్కించనున్న మహేష్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మరో రెండు రోజుల్లో థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న...

Sarkaru Vaari Paata: పంచులతో పిచ్చెక్కించనున్న మహేష్!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మరో రెండు రోజుల్లో థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో మహేష్ సరికొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే సర్కారు వారి పాట చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాబు బాక్సాఫీస్‌ను దడదడలాడించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాలో బాబు చెప్పే డైలాగులు కూడా ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’లో మరో స్పెషల్.. ఆసక్తి రేపుతున్న థమన్ ట్వీట్!

గతంలో పోకిరి, బిజినెస్‌మేన్ చిత్రాల్లో మహేష్ చెప్పిన డైలాగులు ఇప్పటికీ అభిమానులకు చాలా ఇష్టం. అంతలా మహేష్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’లో కూడా అదే స్థాయిలో వన్ లైనర్ డైలాగులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇలాంటి డైలాగులను మహేష్ ఎలా చెబుతాడనేది మనందరికీ తెలిసిందే. మహేష్ మార్క్ డైలాగ్ డెలివరీతో ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.

Sarkaru Vaari Paata: మాంచి ఆకలి మీదున్న ఫ్యాన్స్.. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్

దర్శకుడు పరశురామ్ ఈ సినిమాకు అదిరిపోయే కంటెంట్‌ను అందించాడని.. తన అభిమానులకు ఈ సినిమా ఒక పండగలా ఉంటుందని మహేష్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ వస్తున్నాడు. మహేష్-కీర్తి సురేష్ లవ్‌ట్రాక్ కూడా ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా మారనుందట. అటు థమన్ సంగీతం ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. మరి ఈ సినిమాలో మహేష్ చెప్పబోయే డైలాగులు ప్రేక్షకుల చేత ఏ రేంజ్‌లో విజిల్స్ వేయిస్తాయో చూడాలి. మే 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండగా, ఇప్పటికే ఆన్‌లైన్ బుకింగ్స్‌లో సర్కారు వారి పాట దుమ్ములేపుతోంది.