Covid-19: హోమ్ క్వారంటైన్ లో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్.

Covid-19: హోమ్ క్వారంటైన్ లో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్.

Covid 19

Covid-19: సినీ పరిశ్రమను కరోనా కుదిపేస్తోంది. షూటింగ్ నుంచి సినిమా విడుదల వరకు అన్నింటిపై ప్రభావం చూపుతుంది. ఇక షూటింగ్ సమయంలో అనేక మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.. దీంతో షూటింగ్స్ అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే హీరో మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

సర్కారువారి పాట షూటింగ్ సమయంలో చిత్ర బృందంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సినిమా షూటింగ్ నిలిపివేశారు.. కరోనా సోకిన వారిలో మహేష్ బాబు వ్యక్తిగత సహాయకుడు కూడా ఉన్నాడు. మహేష్ కు కరోనా వచ్చే అవకాశం ఉండటంతో వ్యక్తిగత డాక్టర్ సూచనమేరకు సూపర్ స్టార్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

మొన్నటివరకు ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మేకప్ మ్యాన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రెబల్ స్టార్ ప్రభాస్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.

ఇక ఆచార్య షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సోను సూద్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే.. ఈ షూటింగ్ లో రామ్ చరణ్, సోనూపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే చిరంజీవి, రామ్ చరణ్ సహాయకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందట.. దీంతో వైద్యుల సూచనా మేరకు చరణ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ముగ్గురు టాప్ హీరోలు క్వారంటైన్ లోకి వెళ్లడంతో వారి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కంగారు పడాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచా