Mahesh Babu: తగ్గేదేలే.. స్టార్ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెట్టేసిన మహేష్!

ఇక ఆగేదే లేదంటున్నాడు మహేశ్ బాబు. కొవిడ్ తో వచ్చిన గ్యాప్ తో పాటూ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సూపర్ స్టార్ స్పీడ్ కు కాస్త బ్రేకులేశాయి. వన్స్ మహేశ్ స్విఛ్ ఆన్ మోడ్ కి వస్తే..

Mahesh Babu: తగ్గేదేలే.. స్టార్ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెట్టేసిన మహేష్!

Mahesh Babu

Mahesh Babu: ఇక ఆగేదే లేదంటున్నాడు మహేశ్ బాబు. కొవిడ్ తో వచ్చిన గ్యాప్ తో పాటూ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సూపర్ స్టార్ స్పీడ్ కు కాస్త బ్రేకులేశాయి. వన్స్ మహేశ్ స్విఛ్ ఆన్ మోడ్ కి వస్తే.. సినిమా లైనప్ పెంచుకుంటూ పోవడమే కానీ తగ్గేదేలే అన్నట్టుంది పరిస్థితి. పైగా పాన్ ఇండియా ట్యాగ్ తో సెట్స్ పైకెళ్తున్న సినిమాలే అన్నీ.

Telugu Heroins: ఆన్ స్క్రీనైనా.. ఆఫ్ స్క్రీనైనా.. పెంచేసిన గ్లామర్ డోస్!

ఏప్రిల్ 1 ఫ్రైడే.. ఏప్రిల్ 2 ఉగాది.. పైగా సమ్మర్ సీజన్.. ఈ టైంను కబ్జా చేశాడు ఆచార్య. సో సర్కారు వారి పాట అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నట్టే. మహేశ్ ఆ డేట్ కి రారని తేల్చేసిన చిరు చిరూ ఏప్రిల్ 1కి ఫిక్సయినట్టు తెలుస్తోంది. హెల్త్ ఇష్యూస్, కొవిడ్ ఆంక్షలతో సర్కారు వారి పాట షూటింగ్ లేట్ అవుతోంది. ఇంకా 30 రోజులకు పైగా షూటింగ్ మిగిలే ఉంది. వన్స్ ప్రిన్స్ రంగంలోకి దిగితే బ్రేకులు లేకుండా వర్క్ చేయాలి.

Aishwarya Dhanush: ధనుష్, ఐశ్వర్య విడాకులకు కారణమిదేనా? మళ్ళీ కలుస్తారా?

ఏప్రిల్ ఎండింగ్ లేదంటే మే రెండో వారంలో సర్కారు వారి పాట రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అటు మహేశ్ కోసం వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్.. ఏప్రిల్ లోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారనే టాక్ నడుస్తోంది. అంతా పాన్ ఇండియా బాట పట్టాక మహేశ్ సినిమాను అదే రేంజ్ లో త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. అయితే ఈ మూవీని హై స్పీడ్ తో పూర్తి చేయాలనేది సూపర్ స్టార్ ప్లాన్. అతడు, ఖలేజా తర్వాత రాబోతున్న హ్యాటిక్ మూవీ కాబట్టి ఎక్స్ పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి.

Ravanasura: మాస్ రాజాతో ఆట పాట.. ఒకే సినిమాలో ఐదుగురు హీరోయిన్స్!

త్రివిక్రమ్ సినిమా పూర్తి చెయ్యాలి. రాజమౌళికి డేట్స్ ఇవ్వాలి. 2022 చివర్లో లేదంటే 2023 స్టార్టింగ్ లో జక్కన్న – మహేశ్ కాంబో సెట్స్ పైకెళ్తుందనే ప్రచారం జరుగుతుంది. ఈలోపు ముచ్చటగా మూడోసారి కొరటాల – మహేశ్ కలిసి వర్క్ చేయాలనే ఆలోచన కూడా ఉంది. అదే నిజమైతే.. త్రివిక్రమ్, కొరటాల ప్రాజెక్టులను హైస్వింగ్ లో పూర్తి చేశాకే.. రాజమౌళితో జట్టు కడతారు సూపర్ స్టార్. వన్స్ రాజమౌళి బ్యాచ్ లో జాయినయితే వెంటనే బయటకు రావడం కుదరదు కదా. సో, మహేష్ బాబుకి ఈ ఏడాది నుంచి టైట్ షెడ్యూల్ ఉండబోతుంది.