Mahesh Babu: మహేష్ కోసం బాలీవుడ్ భామను దింపుతున్న జక్కన్న.. ఎవరంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

Mahesh Babu: మహేష్ కోసం బాలీవుడ్ భామను దింపుతున్న జక్కన్న.. ఎవరంటే..?

Mahesh Babu Rajamouli Movie To Have This Bollywood Heroine

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ మరోసారి సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే క్రియేట్ అవుతున్నాయి. కాగా, ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టును ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జక్కన్న, త్వరలోనే పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

Mahesh Babu Rajamouli: జక్కన్నతో మహేష్ ఆట మొదలుపెట్టేది అప్పుడే..?

కాగా, ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్‌గా మారనుండటంతో ఈ సినిమా కోసం జక్కన్న అదిరిపోయే కథను రెడీ చేస్తున్నాడట. అడవి నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

SSMB29 : రాజమౌళి-మహేష్ సినిమా అదే.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్లో మహేష్ సినిమా గురించి చెప్పిన రాజమౌళి..

ఇప్పటికే టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్-K’ మూవీలో దీపికా హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో దీపికా పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే మహేష్ సరసన అందాల భామ దీపికా అయితే వారిద్దరి కాంబినేషన్ బాగుంటుందని జక్కన్న భావిస్తున్నాడట. ఈ మేరకు ఆమెను మహేష్‌తో చేయబోయే సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే మహేష్ సరసన అందాల భామ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుందా లేదా అనేది చిత్ర యూనిట్ అఫీషియల్‌గా కన్ఫం చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.