SSMB28: మహేష్ పాత్ర అలాంటిదా.. త్రివిక్రమ్ ట్రాజెడీని ఇస్తాడా..?

మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో మహేష్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతోంది.

SSMB28: మహేష్ పాత్ర అలాంటిదా.. త్రివిక్రమ్ ట్రాజెడీని ఇస్తాడా..?

Mahesh Babu Role To Have Strange Disease In SSMB28

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లో 28వ చిత్రంగా వస్తుండటంతో ఈ చిత్రాన్ని ప్రస్తుతం SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

SSMB28: ఫస్ట్ లుక్‌లోనే కాదు.. సినిమా మొత్తం ఊచకోతే అంటోన్న మహేష్..?

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా కథకు సంబంధించి తాజాగా నెట్టింట ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు సంబంధించి ఈ వార్త ఉండటంతో అభిమానులు ఈ వార్త ఏమిటా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ పాత్రకు ఓ అరుదైన వ్యాధి ఉంటుందని తెలుస్తోంది. ఈ వ్యాధిని ఇంటర్వెల్ బ్యాంగ్‌లో రివీల్ చేస్తారని.. ఆ బ్యాంగ్ ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

SSMB28 : షూటింగ్ సెట్ నుంచి మహేష్, పూజా పిక్ లీక్.. వైరల్!

అంతేగాక, ఈ వ్యాధి కారణంగా మహేష్ పాత్ర సినిమా క్లైమాక్స్‌లో ఊహించని విధంగా ఉంటుందని చిత్ర వర్గాల్లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ వార్త తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ ఈసారి ట్రాజెడినీ ఇస్తాడా ఏంటి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే మహేష్ పాత్రను త్రివిక్రమ్ అలా డిజైన్ చేశాడా అనేది సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.