Mahesh Babu : ఇది నీకోసం నాన్న.. కృష్ణ బర్త్‌డే రోజు మహేష్ స్పెషల్ ట్వీట్..
మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ థియేటర్స్ లో నేడు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు మహేష్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ.......

Mahesh Babu special tweet on his father krishna Birth Anniversary
Krishna : సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ – త్రివిక్రమ్ టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. ఇవాళ కృష్ణ పుట్టిన రోజు కావడంతో ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా, టాలీవుడ్ లో మొట్టమొదటి కౌబాయ్ సినిమా అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ థియేటర్స్ లో నేడు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు మహేష్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఈ సినిమా నుంచి తలకు మాస్ గా రెడ్ టవల్ కట్టుకొని ఫైట్ కి సిద్ధమవుతున్నట్టు ఉన్న ఓ లుక్ ని మహేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇవాళ చాలా స్పెషల్ రోజు. ఇది మీ కోసమే నాన్న అంటూ ట్వీట్ చేశారు.
Kamal Haasan : ‘ప్రాజెక్ట్ K’ పై మరో ఇంట్రెస్టింగ్ టాక్.. ప్రభాస్‌తో కమల్ హాసన్? కమల్ గెస్ట్ రోల్..
దీంతో మహేష్ చేసిన ట్వీట్, ఆ లుక్ వైరల్ గా మారాయి. ఇక మహేష్ – త్రివిక్రమ్ టైటిల్, గ్లింప్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Today is all the more special! This one's for you Nanna ❤️❤️❤️ pic.twitter.com/HEs9CpeWvY
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2023