Mahesh Babu : కరోనా వల్ల దగ్గరి వాళ్ళని కోల్పోయాను.. మీ అభిమానం చాలు నన్ను నడిపించడానికి..
ఈ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ... చాలా ఆనందంగా ఉంది మిమ్మల్నందర్నీ ఇలా చూడటం. రెండేళ్లు పైనే అయింది మనం కలిసి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని........

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
ఈ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ… చాలా ఆనందంగా ఉంది మిమ్మల్నందర్నీ ఇలా చూడటం. రెండేళ్లు పైనే అయింది మనం కలిసి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా ఫేవరేట్ క్యారెక్టర్స్ లో ఇది ఒకటి. నన్ను పూర్తిగా మార్చేశారు ఈ సినిమాలో. కొన్ని సీన్లు చేసేటప్పుడు పోకిరి రోజులు గుర్తొచ్చాయి. షూటింగ్స్ లో చాలా ఎంజాయ్ చేశాను. పరశురామ్ కథ చెప్పి ఇంటికెళ్లిపోయాక నాకు.. ఒక్కడు సినిమా చూసి డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను. మీరు ఇప్పుడు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఎలా తీస్తానో మీరే చూడండి, ఇరగదీసేస్తాను అని మెసేజ్ పెట్టారు. ఈ సినిమా చూశాక నా అభిమానులకి, నాన్న గారి అభిమానులకి ఆయన ఫేవరేట్ డైరెక్టర్ అవుతారు. సర్కారు వారి పాట నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యు సర్. అంటూ ఎమోషనల్ అయి డైరెక్టర్ ని హగ్ చేసుకున్నారు.
keerthy suresh : షూటింగ్ లో నా పేరు మర్చిపోయి రష్మిక రష్మిక అని పిలిచేవారు
ఈ సినిమాలో చాలా హైలేట్స్ ఉంటాయి. సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తారు. కీర్తి చాలా కొత్తగా చేసింది ఈ సినిమాలో. ఎప్పుడు డేట్స్ అడిగినా కాదనకుండా షూటింగ్స్ కి వచ్చింది. తమన్ మ్యూజిక్ అందరికి కనెక్ట్ అవుతుంది. తమన్ BGM కి నేను పెద్ద ఫ్యాన్. ఈ సినిమాలో అదరగొట్టేసాడు. ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్స్. శేఖర్ మాస్టర్ కి స్పెషల్ థ్యాంక్స్. ఈ నిర్మాతలతో రెండు బ్లాక్ బ్లాస్టర్స్ తీశాను. ఇది మరో బ్లాక్ బ్లాస్టర్ అవుతుంది. కరోనా వల్ల ఈ రెండేళ్లలో నాకు చాలా దూరమయ్యాయి. నాకు దగ్గరైన వాళ్ళు దూరమయ్యారు. ఏది జరిగినా నా మీద మీకున్న అభిమానం మాత్రం మారలేదు. మీ అభిమానం చాలు ధైర్యంగా ముందుకెళ్లడానికి. మీ అందరికి నచ్చే సినిమా రాబోతుంది అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్.
- Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
- Major : రిలీజ్‌కి 10 రోజుల ముందే మేజర్ స్పెషల్ షోలు.. సరికొత్త ప్రయోగం చేస్తున్న అడవి శేష్..
- Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
- Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 8 రోజుల కలెక్షన్స్.. సెంచరీ కన్ఫం!
1Naga Chaitanya: థ్యాంక్ యూ టీజర్ టాక్.. తనను తాను సరిచేసుకునే ప్రయాణం!
2Online Games: ఆన్లైన్ గేమ్స్ నియంత్రణకు కమిటీ
3Namakkal Sree Anjaneyar Temple : నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు
4PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్ చెక్కపెట్టె’ గురించి తెలుసా
5TV Screen: లక్షల్లో దొంగతనం చేయడమే కాకుండా “ఐలవ్యూ” అని రాసిన దొంగలు
6Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం తన తోబుట్టువులకు, బంధువులకు నెల నెలా రూ.10 లక్షలు పంపాడు: ఈడీ
7Temple: మంగళూరు మసీదులో గుడి.. ఉద్రిక్తత
8IPL Betting : జనం సొమ్ముతో పోస్టుమాస్టర్ ఐపీఎల్ బెట్టింగ్-కోటి రూపాయల స్వాహా
9Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో బొమ్మరిల్లు కడతానంటోన్న చైతూ!
10Heart : వీటితో గుండెకు నష్టమే?
-
Lungs : ఊపిరితిత్తుల్లో నీరు ప్రాణాంతకమా?
-
Nani: నేచురల్ స్టార్‌ను ఊరమాస్‌గా మార్చనున్న డైరెక్టర్..?
-
Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
-
Mega154: మలేషియా చెక్కేస్తున్న వాల్తేర్ వీరయ్య..?
-
Instagram Outage : స్తంభించిన ఇన్స్టాగ్రామ్.. యూజర్లకు లాగిన్ సమస్యలు!
-
Redmi Note 11T Pro : రెడ్మి నుంచి కొత్త Note 11T Pro 5G స్మార్ట్ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Karthi Chidambaram : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న కార్తీ చిదంబరం
-
America Gun Culture : అమెరికాలో రోజుకు 53 మందిని బలి తీసుకుంటున్న తుపాకి