SSMB28 First Look: ఊర మాస్ లుక్‌లో మహేశ్ బాబు.. గళ్ల చొక్కా, తలకు రిబ్బన్..ఇంకా
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం SSMB28. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

Mahesh Babu SSMB28 First look
SSMB28: సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం SSMB28. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా హారికా హాసినీ క్రియేషన్స్ సంస్థపై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా 13 జనవరి 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. మహేశ్ బాబు లుక్‌ను రివీల్ చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌లో మహేశ్ బాబు గళ్ల చొక్కా, తలకు రిబ్బన్ కట్టుకుని ఒంటి కాలితో మోకాలి మీద కూర్చొని భూమికి దండం పెడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థియేటర్లలో మాస్ స్ట్రైక్‌కి మరో రెండు రోజులు మాత్రమే ఉంది అంటూ చిత్రబృందం సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
SSMB28 : సోషల్ మీడియాలో SSMB28 వీడియో లీక్.. మహేష్ ఎంత మాస్‌గా ఉన్నాడో చూశారా?
The Thunderous #SSMB28MassStrike arrives in just 2 Days 🔥🔥
Our Beloved SUPER FANS to launch at the theatres near you on May 31st 🤩
Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash pic.twitter.com/KK48BOrUgG
— Haarika & Hassine Creations (@haarikahassine) May 29, 2023
మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతి అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరోజు న మహేశ్ సినిమా టైటిల్‌ను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక ఇదే రోజున కృష్ణ నటించిన ‘మోసగాళ్ళకి మోసగాడు’ సినిమాను రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఘట్టమనేని అభిమానులకు ఒకే రోజు డబల్ భోనాంజానే.
Gulshan Devaiah: సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ నటుడు.. నంబర్ ఉంది కానీ..
ఇదిలా ఉంటే.. SSMB28 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. గుంటూరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ట్రైటిల్‌కు సంబంధించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ‘గుంటూరు కారం’, ‘అమరావతికి అటు ఇటు’, ‘ఊరుకి మొనగాడు’ టైటిల్స్ ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో ఏదో ఒక టైటిల్ ఉంటుందా..? లేదా అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.