Mahesh Babu: రెండో షెడ్యూల్ ముగించి మూడోది మొదలుపెట్టిన మహేష్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమా మహేష్ కెరీర్‌లో 28వ చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది.

Mahesh Babu Starts Third Schedule Of SSMB28 Immediate After Second Schedule
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమా మహేష్ కెరీర్‌లో 28వ చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది.
Mahesh Babu: ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌ను రెడీ చేస్తోన్న మహేష్..?
త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్‌లో మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాల్లో బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. హైదరాబాద్ శివారులో వేసిన ఓ భారీ సెట్‌లో ఈ చిత్ర షూటింగ్‌ను జరుపుకుంటోంది చిత్ర యూనిట్. కాగా, ఇప్పటికే రెండో షెడ్యూల్‌ను శరవేగంగా షూట్ జరుపుకుంటున్న మహేష్, అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఈ షెడ్యూల్‌ను ముగించేశాడు.
Mahesh Babu : జిమ్‌లో మహేష్ కసరత్తులు రాజమౌళి సినిమా కోసమేనా.. వైరల్ అవుతున్న ఫోటోలు!
అయితే రెండో షెడ్యూల్ ముగియగానే, వెంటనే మూడో షెడ్యూల్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు మహేష్. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.