SSMB28: పండగకు ట్రీట్ పట్టుకొస్తున్న మహేష్.. ఏమిటో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

SSMB28: పండగకు ట్రీట్ పట్టుకొస్తున్న మహేష్.. ఏమిటో తెలుసా?

Mahesh Babu To Give SSMB28 Treat

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

SSMB28: మహేష్ మూవీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్న త్రివిక్రమ్!

కాగా, ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్ కథతో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటంతో ఈ సినిమాను ప్రేక్షకులు తప్పుకుండా ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఉగాది కానుకగా ఓ అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

SSMB28 : SSMB28 న్యూ షెడ్యూల్ అప్డేట్..

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఉగాది సందర్భంగా అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట. దీంతో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అదే రోజున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా, ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఉగాదికి మహేష్ 28వ చిత్రం నుండి మాసివ్ అప్డేట్ వస్తుందా లేదా అనేది చూడాలి.