Mahesh Babu: యాక్షన్‌తోనే మహేష్ యాక్షన్ షురూ..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది....

Mahesh Babu: యాక్షన్‌తోనే మహేష్ యాక్షన్ షురూ..?

Mahesh Babu To Start Trivikram Movie With Action Sequence

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేష్, తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Mahesh Babu: ఆ డైరెక్టర్‌తో హ్యాట్రిక్ కొడతానంటోన్న మహేష్..?

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ జూలై నెలలో స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ షూటింగ్‌ను ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందట. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న మహేష్, ఈ సినిమాలో మరోసారి కొత్త అవతారంలో కనిపిస్తాడట. అయితే ఈ సినిమాను చాలా తక్కువ సమయంలో పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అందులోనే..

త్రివిక్రమ్ ఈసారి మహేష్ కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడని, అందులో భాగంగానే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమాను స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నాడు. మరి ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఏ రేంజ్‌లో ఉంటాయా అని అప్పుడే మహేష్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.