Mahesh Babu: ఆ డైరెక్టర్‌తో హ్యాట్రిక్ కొడతానంటోన్న మహేష్..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది......

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేష్, తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయిన మహేష్, ఆ తరువాత తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నాడు.
Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అందులోనే..
ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా స్టార్ట్ అయ్యేలోపే త్రివిక్రమ్‌తో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని మహేష్ భావిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో మరో వార్త జోరుగా వినిపిస్తోంది. మహేష్ ఈ రెండు ప్రాజెక్టుల తరువాత మరో ప్రాజెక్టును కూడా అప్పుడే లైన్లో పెడుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో మరోసారి మహేష్ చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాడట.
Mahesh Babu : ఫ్యామిలీలతో కలిసి ఫారెన్ టూర్స్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేష్, చరణ్
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. అయితే మహేష్‌తో మరో సినిమా తీసేందుకు కొరటాల ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నాడని.. ఈ క్రమంలోనే మహేష్ కోసం ఓ పవర్ఫుల్ స్టోరీలైన్ రెడీ చేశాడట కొరటాల. ఒక్కసారి తాను కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేయగానే, మహేష్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతాడట ఈ డైరెక్టర్. ఇక మహేష్‌తో తాను చేయబోయే సినిమా ఖచ్చితంగా హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ చేసి తీరాలనే కసిగా ఉన్నాడట. మరి నిజంగానే మహేష్ కోసం కొరటాల కథను రెడీ చేస్తున్నాడా.. నిజంగానే ఈ కాంబో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
1Helicopter Services: లదాఖ్ ప్రాంతంలో అందుబాటులోకి హెలికాప్టర్ సేవలు
2Chiranjeevi : ప్రధాని మోదీతో వేదికని పంచుకోబోతున్న చిరంజీవి
3Trains Cancelled: బల్లార్షా నుంచి సికింద్రాబాద్‌కు మధ్య రైళ్ల సర్వీసులు రద్దు
4AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతి రైతులకు ఊరట..
5GST: పెరగనున్న హోటల్ రూమ్ ఛార్జీలు.. కొత్త జీఎస్టీ వివరాలు ఇవే
6Dil Raju : 50 ఏళ్ళ వయసులో తండ్రి అయిన దిల్‌రాజు.. పండంటి బాబుకి జన్మనిచ్చిన దిల్‌రాజు వైఫ్..
7Covid Cases: భారత్‌లో లక్షకు చేరువవుతున్న కరోనా కేసులు
8Maharashtra political crisis: మహా’సంక్షోభం’లో కీలక మలుపు.. బలనిరూపణ చేసుకోవాలని ఉద్ధవ్‌కు గవర్నర్ ఆదేశం.. రేపు సాయంత్రం వరకు డెడ్ లైన్..
9Poojahegde : బాలీవుడ్ లో నేను చేసిన చెత్త సినిమా అది.. దానివల్ల నాకు ఆఫర్స్ రాలేదు..
10Rajya Sabha: పెద్దల సభలో నేరస్తులు..!
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి