SSMB28: సర్‌ప్రైజ్ ఇచ్చిన మహేష్.. మాస్ ఎంట్రీతో రిలీజ్ డేట్ లాక్ చేశాడుగా!
టాలీవుడ్ సూపర్ స్టార్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.

Mahesh Babu Trivikram Gives Massive Update On SSMB28
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ వస్తుందని తెలిసినప్పటి నుండి ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు మహేష్-త్రివిక్రమ్ ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఈ మూవీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
SSMB28: ‘అమరావతికి అటు ఇటు’గా తిరుగుతున్న మహేష్.. ఇదే ఫిక్స్ అవుతుందా?
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుందనే విషయం తప్ప, ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవవుతూ వచ్చారు. కాగా, తాజాగా ఈ సినిమా నుండి ఓ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అనే వార్తలకు తాజాగా చెక్ పెట్టారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు ఓ బ్లాస్టింగ్ అప్డేట్‌ను ఇచ్చారు.
SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీ వచ్చేది అప్పుడేనా.. నెట్టింట జోరందుకున్న టాక్!
ఈమేరకు ఓ మాస్ పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో మహేష్ ఊరమాస్ అవతారంలో సిగరెట్ తాగుతూ, నడుచుకుంటూ వస్తున్నాడు. మహేష్‌ను త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడో ఈ పోస్టర్‌తోనే చెప్పేశాడు. ఇక ఈ సినిమాపై ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ పోస్టర్ చేసిందని చెప్పాలి.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
The Reigning Superstar @urstrulymahesh in an all new MASS avatar is all set to meet you with #SSMB28 in theatres from 13th January 2024 worldwide! 🤩#SSMB28FromJAN13 🎬🍿#Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/qqXjnJphqH
— Haarika & Hassine Creations (@haarikahassine) March 26, 2023