Mahesh Babu: మహేష్-త్రివిక్రమ్ సినిమా ఆగింది అందువల్ల కాదట.. అసలు కారణం ఇదేనట!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను చాలా త్వరగా పూర్తి చేసుకుని, నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమా ఆలస్యానికి కారణం ఇదేనంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

Mahesh Babu: మహేష్-త్రివిక్రమ్ సినిమా ఆగింది అందువల్ల కాదట.. అసలు కారణం ఇదేనట!

Mahesh Babu Trivikram Movie Did Not Stop For This Reason

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా త్రివిక్రమ్ తనదైన మార్క్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మహేష్ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇక మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో చాలా కాలం తరువాత సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

SSMB28: మహేష్ సినిమాకు ఆ టైటిల్ అయితేనే బెస్ట్ అంటోన్న ఫ్యాన్స్!

అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను చాలా త్వరగా పూర్తి చేసుకుని, నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమా ఆలస్యానికి కారణం ఇదేనంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ఆలస్యానికి కారణం స్క్రిప్టులో మహేష్ కొన్ని మార్పులు చేయమన్నాడని సినీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది.

SSMB28: మహేష్ త్రివిక్రమ్‌ల “SSMB28” రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన మూవీ మేకర్స్!

ఇటీవల మహేష్ బాబు తల్లి మృతిచెందడంతో ఆయన కొంత గ్యాప్ తీసుకుంటున్నాడని.. తన ఫ్యామిలీతో కలిసి సమయం గడుపుతున్న కారణంగానే ఆయన తన సినిమా కొత్త షెడ్యూల్‌ను ఇంకా స్టార్ట్ చేయలేదని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక త్వరలోనే మహేష్, త్రివిక్రమ్ మూవీ మళ్లీ పట్టాలెక్కి శరవేగంగా షూటింగ్ జరుపుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.