Mahesh Babu: మహేష్ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను అందుకే అంత త్వరగా ముగించారా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటంగ్‌ను ఇటీవల ప్రారంభించారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను కేవలం మూడు రోజుల్లోనే ముగించేయడంతో అభిమానులతో పాటు చిత్ర వర్గాలు కూడా అవాక్కయ్యాయి.

Mahesh Babu: మహేష్ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను అందుకే అంత త్వరగా ముగించారా..?

Mahesh Babu Trivikram Movie First Schedule Rumours

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటంగ్‌ను ఇటీవల ప్రారంభించారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను కేవలం మూడు రోజుల్లోనే ముగించేయడంతో అభిమానులతో పాటు చిత్ర వర్గాలు కూడా అవాక్కయ్యాయి. ఇంత త్వరగా ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ముగించడంతో ఈ సినిమా షూటింగ్ కూడా అంతే త్వరగా పూర్తవుతుందని అందరూ భావిస్తున్నారు.

SSMB28: మహేష్ సినిమాకు ఆ టైటిల్ అయితేనే బెస్ట్ అంటోన్న ఫ్యాన్స్!

అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ యాక్షన్ సీక్వెన్స్ ఔట్‌పుట్ విషయంలో దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేష్ బాబు ఇద్దరూ కూడా శాటిస్ఫై కాలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించాలని.. అందుకే ఈ సీక్వెన్స్‌ను మళ్లీ చిత్రీకరించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ కారణంగానే తొలి షెడ్యూల్‌ను ముందుగా అనుకున్నట్లుగా కాకుండా, కేవలం మూడు రోజుల్లోనే ముగించారట మహేష్ అండ్ టీమ్.

SSMB28: మహేష్ త్రివిక్రమ్‌ల “SSMB28” రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన మూవీ మేకర్స్!

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ పూజా హెగ్డే నటిస్తోండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.