Lokesh Kanagaraj : మిమ్మల్ని కలుస్తాను.. విక్రమ్ డైరెక్టర్ తో మహేష్ మీట్.. సినిమా ఛాన్స్?

తాజాగా విక్రమ్ సినిమా చూసిన మహేష్ వరుస ట్వీట్స్ పోస్ట్ చేశాడు. మహేష్ తన ట్వీట్స్ లో.. ''విక్రమ్‌ బ్లాక్‌బస్టర్ సినిమా. ఒక న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ సినిమా. లోకేశ్ కనకరాజ్.. మిమ్మల్ని కలిసి విక్రమ్‌ మూవీ మొదలు నుంచి...........

Lokesh Kanagaraj :  మిమ్మల్ని కలుస్తాను.. విక్రమ్ డైరెక్టర్ తో మహేష్ మీట్.. సినిమా ఛాన్స్?

Lokesh

Mahesh Babu :  లోక నాయకుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తర్వాత ‘విక్రమ్‌’ సినిమాతో భారీ విజయం సాధించారు. లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన అయి సినిమా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం అభినందిస్తున్నారు. ఇక సినిమా సక్సెస్ విషయంలో కమల్ చాలా ఆనందంగా ఉన్నారు. తాజాగా విక్రమ్ సినిమా చూసిన మహేష్ వరుస ట్వీట్స్ పోస్ట్ చేశాడు.

మహేష్ తన ట్వీట్స్ లో.. ”విక్రమ్‌ బ్లాక్‌బస్టర్ సినిమా. ఒక న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ సినిమా. లోకేశ్ కనకరాజ్.. మిమ్మల్ని కలిసి విక్రమ్‌ మూవీ మొదలు నుంచి చివరి వరకు షూటింగ్ ఎలా జరిగిందో, ఆ ప్రయాణం ఎలా జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్ తమ అద్భుతమైన నటనతో మెప్పించారు. అనిరుధ్‌ బెస్ట్ మ్యూజిక్ అందించాడు. చాలాకాలం తర్వాత నా ప్లేలిస్ట్‌ టాప్‌లో విక్రమ్‌ ఉంది. ఇక చివరగా లెజెండ్‌ కమల్‌ హాసన్‌ నటన గురించి చెప్పేందుకు నాకు అర్హత లేదు. ఒక అభిమానిగా ఇలాంటి సినిమా చూసి చాలా గర్విస్తున్నాను. మీ టీం అందరికి నా అభినందనలు” అని పోస్ట్ చేశాడు.

Small Movies : ఆసక్తి పెంచుతున్న చిన్న సినిమాలు..

ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి. అయితే ఇప్పటికే లోకేష్ కనగరాజ్ టాలీవుడ్ ఎంట్రీ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. చరణ్ కి కథ కూడా వినిపించాడు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. మహేష్ ట్వీట్ తో మహేష్ ని లోకేష్ కచ్చితంగా కలుస్తాడని తెలుస్తుంది. దీంతో మహేష్ కి కూడా ఒక కథ చెప్పి ఓకే చేసుకొని సినిమా ఫైనల్ చేస్తే బాగుండు అని మహేష్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి మహేష్, లోకేష్ ల మీటింగ్ ఎప్పుడు ఉంటుందో? వారి కాంబోలో సినిమా ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.