Mahesh Babu trainer: సూపర్ స్టార్ మహేశ్ ట్రైనర్ చెప్పే మూడు హైబ్రిడ్ ఎక్సర్‌సైజెస్‌లు తెలుసా..

మహేశ్ బాబు, సమంతా అక్కినేని, అల్లు అర్జున్‌లను ట్రైన్ చేస్తున్నారు మినాష్ గాబ్రియెల్. అయితే ఆయన చెప్పే హైబ్రిడ్ ఎక్సర్‌సైజ్ తూ.చా తప్పకుండా పాటించి మీరు కూడా పవర్ అందుకోమేని చెప్తున్నారు.

Mahesh Babu trainer: సూపర్ స్టార్ మహేశ్ ట్రైనర్ చెప్పే మూడు హైబ్రిడ్ ఎక్సర్‌సైజెస్‌లు తెలుసా..

Celebrety Trainer

Mahesh Babu trainer: సెలబ్రిటీ ట్రైనర్ల గురించి తెలుసుకోవాలంటేనే ఓ క్రేజ్. ఎందుకంటే మనకు నచ్చిన స్టార్స్ ఫిజిక్ అలా ఉండటానికి వెనుక కారణం వాళ్లే కదా. ఉన్నట్లుండి వేరియేషన్స్ చూపించాలన్నా.. నెలల తరబడి ఒకటే ఫిజిక్ మెయింటైన్ చేయాలన్నా వాళ్లు చెప్పినవే తప్పక పాటించాలి. తన విలువైన సూచనలతో మహేశ్ బాబు, సమంతా అక్కినేని, అల్లు అర్జున్‌లను ట్రైన్ చేస్తున్నారు మినాష్ గాబ్రియెల్.

అయితే ఆయన చెప్పే హైబ్రిడ్ ఎక్సర్‌సైజ్ తూ.చా తప్పకుండా పాటించి మీరు కూడా పవర్ అందుకోమేని చెప్తున్నారు. ఎక్సర్‌సైజ్ పై అవగాహన, ఫిట్‌నెస్ పెంచాలనే కుతూహలం ఉన్న వారు ఇవి తప్పక తెలుసుకోవాలి. డైలీ పాటిస్తే ఇంకా మంచిది.

ఇక మహేశ్ బాబు ట్రైనర్ గా చేస్తున్న మినాశ్.. వారం పాటు ట్రైనింగ్ ఇచ్చి.. కార్డియోతో పాటు హై ఇంటెన్సిటీతో కూడా రెండు రకాల ఎక్సర్‌సైజెస్ చేయిస్తారు. ‘ప్రతి సారి ప్రోగ్రాం మార్చే ముందు దాదాపు 8నుంచి 12వారాల సమయం తీసుకుంటాం’ అని ఆయన అన్నారు. ఈ మూడు సింపుల్ ఎక్సర్‌సైజెస్ మాత్రం కచ్చితంగా చేయిస్తారట.

1. ప్లాంక్
ఎక్సర్ సైజ్ ఎప్పుడూ సమతూకంగా ఉండాలి. లేదంటే అది పర్‌ఫెక్ట్ కాదు. పూర్తి చేయడానికి ఒక్క నిమిషం ముందు ముగించినా కరెక్ట్ అనిపించుకోదు. అలాగే ఎక్కువ సేపు చేసినా ప్రమాదమే. వీటిలోకి వచ్చేదే ఫ్లాంక్. బిగెనర్ లెవల్ లో ఉన్న వారు కచ్చితంగా 60సెకన్ల పాటు ప్లాంక్ మాత్రమే వేయాలి.

View this post on Instagram

A post shared by Minash Gabriel (@minash.gabriel)

2. చేతులు నిటారుగా వెనక్కు లాగడం
వీటిని సాధారణంగా లాట్స్ అని పిలుస్తారు. జాయింట్ మజిల్స్ అయిన హిప్స్, భుజం, మోచేయి భాగాలకు ఇది కీలకం. వెనుక భాగం స్టాబిలైజ్ చేయడంలో ఇది ఇంపార్టెంట్. ఎక్కువ బరువులు ఎత్తాలనుకునేవారు ముందుగా ఇది చేయాలి. స్టైట్ గా లాగడం వల్ల భుజాలు, బైసప్స్, వీపుపై భాగం, మోచేతుల పైన ఎఫెక్ట్ కనిపిస్తుంది.

3. స్క్వాట్
ఈ స్క్వాట్ చేయడానికి చాలా రకాలు ఉన్నాయి. మన అనాటమీని బట్టి అది మార్చుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది మాత్రం ఇదే మోకాళ్ల మీద బరువు పెట్టి చేతులు నేలకు సమాంతరంగా చాపి పాదాలు మాత్రమే నేలకు ఆనించాలి. అలా వీలుకాకపోతే మోకాలును ఏదైనా బలమైన వస్తువుకు ఆనించి చేతులు చాపి పాదాలపై బరువు ఉంచాలి.

లాంగ్ టర్మ్ హెల్తీగా ఉండాలనుకునేవారు ఫిట్ నెస్ తప్పకుండా పాటించారు. ఇదేదో ఓవర్ నైజ్ జర్నీ కాదు. దీని కోసం శ్రమించాలి. క్రమశిక్షణతో ఫాలో అయితే ఒక షేప్ ను మెయింటైన్ చేయగలమని ట్రైనర్ మినాశ్ అంటున్నారు. ఫిట్‌నెస్ ప్లాన్ అనేది వయస్సు, మగ లేదా ఆడ, న్యూట్రిషన్ లను దృష్టిలో ఉంచుకుని ఎంచుకోవాలి. పోషకాహార లోపంతో వర్కౌట్ ఎప్పటికీ చేయలేరని ఆయన అంటున్నారు.