Aliya Bhat : జీవితాంతం తండ్రి సంపాదించిన డబ్బును రెండేళ్లలో సంపాదించిన స్టార్ హీరోయిన్

 బాలీవుడ్‌ ఒకప్పటి స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మహేష్ భట్ హిందీ సినీ పరిశ్రమలో ఒక దిగ్గజం. ఆయన వారసురాలిగా ఆమె కూతురు ఆలియా భట్ సినీ పరిశ్రమలో దూసుకుపోతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా

Aliya Bhat : జీవితాంతం తండ్రి సంపాదించిన డబ్బును రెండేళ్లలో సంపాదించిన స్టార్ హీరోయిన్

Aliya

Aliya Bhat :  బాలీవుడ్‌ ఒకప్పటి స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మహేష్ భట్ హిందీ సినీ పరిశ్రమలో ఒక దిగ్గజం. ఆయన వారసురాలిగా ఆమె కూతురు ఆలియా భట్ సినీ పరిశ్రమలో దూసుకుపోతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమా చేసింది ఆలియా. 2012 లో ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయం సాధించి, నటనలో కూడా మంచి పేరు సంపాదించింది. 10 ఏళ్లలోనే దాదాపు 15 సినిమాలు చేసింది. మంచి మంచి విజయాలు సాధించింది. ప్రస్తుతం ఆలియా చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. అందులో మన ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఒకటి.

Bigg Boss 5 : స్పెషల్ పవర్ తో నామినేషన్స్ నుంచి వీళ్ళు సేఫ్

మహేష్ భట్ వార‌సురాలిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆలియా భ‌ట్‌ త‌క్కువ టైంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా పేరు తెచ్చుకుంది. ఇక సంపాద‌న విష‌యంలో అయితే తండ్రినే మించిపోయిందంట‌. ఆలియా భ‌ట్‌ను చూసి ఆమె తండ్రి మ‌హేశ్ భ‌ట్ మురిసిపోతున్నాడు. మహేష్ భట్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆలియా గురించి మాట్లాడుతూ.. సినిమా రంగంతో పాటు ఎక్క‌డైనా స‌రే రాణించాలంటే టాలెంట్ ఉండాలి. కొంత‌మంది త‌మ టాలెంట్‌తో చిన్న వ‌య‌సులోనే ఉన్నత శిఖ‌రాల‌ను అధిరోహిస్తున్నారు. నా కూతురు ఆలియా మంచి పేరుని సంపాదించడమే కాక నేను 50 ఏళ్లలో క‌ష్ట‌ప‌డి సంపాదించినంత డ‌బ్బును ఆలియా కేవ‌లం రెండేళ్ల‌లోనే సంపాదించింద‌ని తెలుపుతూ ఆనందపడ్డారు.