Sarkaru Vaari Paata: మహేష్ కాన్ఫిడెన్స్.. పోకిరి రేంజ్ వైబ్స్ ఇస్తుందా?

సూపర్ స్టార్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కనిపించని లుక్ లో కాస్త వెనక్కు వెళ్లి మరీ వింటేజ్ లోకి మారిపోవడం..

Sarkaru Vaari Paata: మహేష్ కాన్ఫిడెన్స్.. పోకిరి రేంజ్ వైబ్స్ ఇస్తుందా?

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కనిపించని లుక్ లో కాస్త వెనక్కు వెళ్లి మరీ వింటేజ్ లోకి మారిపోవడం కూడా అభిమానులలో ఈ సినిమా మీద అంచనాలను పెంచేసింది. సర్కారు వారి పాట టైటిల్ తోనే ఇదేదో స్పెషల్ సినిమా అన్న ఫీల్ తెచ్చిన దర్శకుడు పరశురామ్ పెట్ల ఆ తర్వాత కూడా ఇచ్చే ప్రతి అప్డేట్ లో కూడా ఎక్కడా అంచనాలు తగ్గకుండా ఇది మహేష్ కెరీర్ లో స్పెషల్ ప్రాజెక్ట్ అన్నట్లే బజ్ తెచ్చాడు.

Sankranti 2022: సంక్రాంతికి ధియేటర్లో సినిమాల దండయాత్ర!

అందుకు తగ్గట్లే ప్రీ లుక్ పోస్టర్ లో మహేష్ ను మళ్ళీ వింటేజ్ బాబుని గుర్తు చెయ్యడంతో అంతా ఓ పదేళ్లు వెనక్కి వెళ్లిపోయారు. పదేళ్లు అంటే అందరికీ గుర్తొచ్చేది పోకిరి మహేష్ బాబే కదా. సరిగ్గా మహేష్ రఫ్ లుక్ కూడా పోకిరితో మ్యాచ్ అవడంతో ఇప్పుడు అభిమానుల నుండి సూపర్ స్టార్ కి ఎదురయ్యే ప్రశ్నలు కూడా పోకిరితో పోల్చే ఎదురవుతున్నాయి. ఇక మహేష్ కూడా అభిమానుల ఊహలకు తగ్గట్లే నో డౌట్ సర్కారు వారి పాట ఖచ్చితంగా పోకిరిని గుర్తు చేస్తుందని హామీ ఇచ్చేశాడు.

Telugu Upcoming Films: ఫుల్ బిజీగా ఫెస్టివల్ సీజన్.. టఫ్ ఫైట్ తప్పేలా లేదు!

మహేష్ ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా జరిగిన ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధుల నుండి సర్కారు వారి పాటపై పలు ప్రశ్నలు ఎదురవ్వగా మహేష్ కూడా సాలిడ్ రిప్లై ఇచ్చాడు. ఈ సినిమా డెఫినెట్ గా పోకిరి వైబ్స్ ని తీసుకొస్తుందని, ఈ కథని ఒక్క సిట్టింగ్ లోనే ఓకే చేసానని చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చూస్తే సర్కారు వారి పాట విషయంలో మహేష్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరి నిజంగానే సర్కారు వారి పాట పోకిరి రేంజ్ అందుకుంటుందా అన్నది చూడాలి.