Mahesh Koneru : ఎన్టీఆర్‌ – అట్లీ సినిమా మహేష్ కోనేరు డ్రీమ్ ప్రాజెక్ట్.. అంతలోనే

ఎన్టీఆర్ - తమిళ్ యంగ్ డైరెక్టర్ అట్లీల క్రేజీ కాంబినేషన్‌లో ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నిర్మించాలనేది మహేష్ కోనేరు కోరిక..

Mahesh Koneru : ఎన్టీఆర్‌ – అట్లీ సినిమా మహేష్ కోనేరు డ్రీమ్ ప్రాజెక్ట్.. అంతలోనే

Ntr Atlee

Mahesh Koneru: పిఆర్‌వో నుండి యువ నిర్మాతగా ఎదిగిన మహేష్ కోనేరు హఠాన్మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద చాయలు అలముకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు అత్యంత సన్నిహితుడైన మహేష్ గుండెపోటుతో మంగళవారం ఉదయం కన్నుమూశారు.

Mahesh Koneru : మహేష్ కోనేరు ఇకలేరు

ఆయన మృతికి సంతాపం తెలుపుతూ తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్ కోనేరుతో సన్నిహిత సంబంధాలున్న మీడియా మిత్రులు ఆయనతో ఉన్న అనుంబధాన్ని గుర్తుచేసుకుంటూ మహేష్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన విషయాలు చర్చించుకుంటున్నారు.

ఎన్టీఆర్ – తమిళ్ యంగ్ డైరెక్టర్ అట్లీల క్రేజీ కాంబినేషన్‌లో ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నిర్మించాలనేది మహేష్ కోరిక అట. అందుకు పలుసార్లు ప్రయత్నాలు కూడా చేశారని, ఆ నేపథ్యంలోనే విజయ్ హీరోగా అట్లీ డైరెక్ట్ చేసిన ‘విజిల్’, ‘మాస్టర్’ సినిమాలను తెలుగులో రిలీజ్ చేశారట మహేష్. తారక్ – అట్లీ కాంబినేషన్‌లో సినిమా చెయ్యాలనే కోరిక తీరకుండానే ఇంత త్వరగా వెళ్లిపోయాడు అంటూ భావేద్వేగానికి గురవుతున్నారు.