మహేశ్, మురుగదాస్ కాంబోలో హాలీవుడ్ మూవీ

  • Published By: veegamteam ,Published On : May 4, 2019 / 05:26 AM IST
మహేశ్, మురుగదాస్ కాంబోలో హాలీవుడ్ మూవీ

క్రియేటివ్ డైరెక్టర్ అని నమ్మి సినిమా చేస్తే స్టార్ హీరోని నట్టేట ముంచేశాడు ఆ దర్శకుడు. కానీ ఇంత జరిగినా మళ్లీ అదే డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ఆ హీరో రెడీ అవుతున్నాడు. ఈసారి టాలివుడ్, కోలివుడ్ సినిమా కాదండీ ఏకంగా హాలివుడ్ మూవీనే ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో, డైరెక్టర్ ఎవరు..?

మహేశ్ బాబు, కోలివుడ్ క్రియేటివ్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్పైడర్. భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. మహేశ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇంత భారీ డిజాస్టర్ ని ఇచ్చినా మహేశ్, డైరెక్టర్ మురుగదాస్ కి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరి కాంబినేషన్ లో ఈసారి ఏకంగా ఓ హాలివుడ్ మూవీయే తెరకెక్కబోతోందని ప్రచారం జరుగుతోంది.

రీసెంట్ గా హాలివుడ్ నటుడు బిల్ డ్యూక్ మహేశ్ బాబుతో పాటుగా డైరెక్టర్ మురుగదాస్ ని లాస్ ఏంజిల్స్ లోని తన ఇంటికి లంచ్ కి రావాల్సిందిగా ట్విట్టర్ ద్వారా ఆహ్వానించాడు. అంతేకాదు మహేశ్ తో కలిసి ఓ స్పై మూవీలో నటించాలనుందని స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేద్దామని ట్వీట్ లో పేర్కొన్నాడు. అందుకే మహేశ్, మురుగదాస్ కాంబోలో హాలివుడ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని రూమర్స్ ఓ రేంజ్ లో నడుస్తున్నాయి. ఒకవేళ అన్నీ కలిసొచ్చి నిజంగానే మహేశ్ హాలివుడ్ కి వెళ్తే ఫ్యాన్స్ ఆనందానికి అడ్డు అదుపు ఉండదు.