Mahesh babu : రాజమౌళి సినిమాతోనే పాన్ ఇండియా ఎంట్రీ : మహేష్

మహేష్ రాజమౌళితో సినిమా ఉంటుంది అని అంతకుముందే అనౌన్స్ చేశారు. రాజమౌళి కూడా మహేష్ తో సినిమా ఉందని చెప్పారు. అభిమానులు వీరిద్దరి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా మహేష్ తన

Mahesh babu : రాజమౌళి సినిమాతోనే పాన్ ఇండియా ఎంట్రీ : మహేష్

Mahesh

Mahesh babu :  సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి సినిమాపై భారీ అంచనాలని పెంచింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తీయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ‘సర్కారు వారి పాట’ షూట్ అయిపోగానే కొద్దీ రోజులు గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెట్టబోతున్నాడు. త్రివిక్రమ్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు. ఇప్పటికే చాలా మంది హీరోలు పాన్ ఇండియా లెవెల్లో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోలంతా వాళ్ళ సినిమాలని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మహేష్ ఒక్కడే ఇంకా పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేయలేదు.

Shannu Deepthi : దీప్తి ఫోన్ లో షన్ను నెంబర్ ఏ పేరుతో సేవ్ చేసిందో తెలుసా??

మహేష్ రాజమౌళితో సినిమా ఉంటుంది అని అంతకుముందే అనౌన్స్ చేశారు. రాజమౌళి కూడా మహేష్ తో సినిమా ఉందని చెప్పారు. అభిమానులు వీరిద్దరి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా మహేష్ తన పాన్ ఇండియా సినిమా గురించి మాట్లాడుతూ.. తన పాన్ ఇండియా ఎంట్రీ రాజమౌళి సినిమాతోనే ఉంటుంది అని మహేష్ క్లారిటీ ఇచ్చారు. సరైన టైంలో ఆ టైంకి తగ్గ సినిమా చేయాలి అనుకుంటాను అలా తన మొదటి పాన్ ఇండియన్ సినిమా రాజమౌళితో చెయ్యాలని దానితో ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాను అని తెలిపారు. దీంతో రాజమౌళి మహేష్ కాంబినేషన్లో సినిమా కన్ఫర్మ్ అయిపొయింది.

Samantha : సమంత విడాకుల తర్వాత అనౌన్స్ చేసిన మొదటి సినిమా.. గట్టిగానే ప్లాన్ చేసింది

రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమాని తీస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా తర్వాత మహేష్ సినిమా కోసం వర్క్ చేస్తారా? లేక చిన్న సినిమా ఒకటి తీస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇటీవల రాజమౌళి కూడా మహేష్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా మా నాన్న గారితో రాయించట్లేదు. వేరే రైటర్ తో రాయిస్తున్నాను అని తెలిపారు. రాజమౌళి అన్ని సినిమాలకి వాళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్ రచయిత. మరి మహేష్ సినిమాకి వేరే వాళ్ళతో ఫస్ట్ టైం రాయిస్తున్నారంటే ఆలోచించాల్సిందే. మొత్తానికి మహేష్ రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే ఒక రెండు సంవత్సరాలు పట్టొచ్చు అని తెలుస్తుంది.