Gautham : టెన్త్ పాసైన గౌతమ్.. గర్వపడుతున్నాము అంటూ.. జర్మనీలో పార్టీ చేసుకుంటున్న మహేష్ ఫ్యామిలీ..

తాజాగా మహేష్, నమ్రతలు ఇద్దరూ తమ సోషల్ మీడియాలలో ఒక స్పెషల్ పోస్ట్ చేశారు. మహేష్ తనయుడు గౌతమ్.........................

Gautham : టెన్త్ పాసైన గౌతమ్.. గర్వపడుతున్నాము అంటూ.. జర్మనీలో పార్టీ చేసుకుంటున్న మహేష్ ఫ్యామిలీ..

Mahesh Babu

 

Gautham Ghattamaneni :  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఒక రీజనల్ సినిమాతో 200 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు మహేష్. సక్సెస్ తర్వాత తాజాగా మహేష్ జర్మనీకి ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్ళాడు. మహేష్ షూటింగ్ లేకపోతే ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్స్ వేస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ సారి ట్రిప్ జర్మనీకి వేశాడు.

తాజాగా మహేష్, నమ్రతలు ఇద్దరూ తమ సోషల్ మీడియాలలో ఒక స్పెషల్ పోస్ట్ చేశారు. మహేష్ తనయుడు గౌతమ్ CBSE లో మంచి మార్కులతో టెన్త్ క్లాస్ పాసయ్యాడు. ఇందుకు మహేష్ ఓ రెస్టారెంట్ లో ఫ్యామిలీతో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి గౌతమ్ 10th క్లాస్ పాసయ్యాడు. తనని చూస్తే గౌరవంగా ఉంది. అందుకే ఈ పార్టీ అని పోస్ట్ చేసాడు. ప్రస్తుతం జర్మనీలో ఉండటంతో అక్కడే ఓ ఫేమస్ రెస్టారెంట్ లో గౌతమ్ టెన్త్ క్లాస్ పాసైన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

Karan Johar : తారలు తళుక్కుమన్న వేళ.. కరణ్ జోహార్ బర్త్‌డే సెలబ్రేషన్స్..

ఇక నమ్రత శిరోద్కర్ గౌతమ్ ఫోటోని షేర్ చేసి.. నా కొడుకు పెద్దవాడయ్యాడు. టెన్త్ క్లాస్ పాసయ్యాడు. అన్ని సబ్జెక్ట్ లలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. తనని చూసి గర్వపడుతున్నాను. తన జీవితంలో ఇప్పుడు మరో అధ్యాయం మొదలవ్వనుంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇక మహేష్ అభిమానులు గౌతమ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.