BiggBoss Non Stop : బిగ్‌బాస్‌ నుంచి మహేష్ విట్టా అవుట్..

17 మందితో ప్రారంభమైన ఈ షోలో గత ఆరు వారాలు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి, ముమైత్‌ ఖాన్‌, స్రవంతి ఇప్పటికే ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం మరొకరు........

BiggBoss Non Stop :  బిగ్‌బాస్‌ నుంచి మహేష్ విట్టా అవుట్..

Mahesh

 

BiggBoss Non Stop :  తెలుగులో కూడా బాగా పాపులారిటీ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌. కానీ అనూహ్యంగా ఈ సారి టెలివిజన్ నుంచి ఓటీటీకి షిఫ్ట్ అయింది బిగ్‌బాస్‌. గతంలో టీవిలో టెలికాస్ట్ అయినప్పుడే దీనికి మంచి క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ కంటెస్టెంట్స్ అభిమానులు తప్ప బిగ్‌బాస్‌ ని ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఓటీటీలో టెలికాస్ట్ అవుతుండటం వల్ల బిగ్‌బాస్‌ కి అనుకున్నంత క్రేజ్ కూడా రాలేదు ఈ సీజన్.

ఇక 17 మందితో ప్రారంభమైన ఈ షోలో గత ఆరు వారాలు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి, ముమైత్‌ ఖాన్‌, స్రవంతి ఇప్పటికే ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం మరొకరు ఎలిమినేట్ అయి ప్రస్తుతం 10 మంది మాత్రమే మిగిలారు. ఈ వారం నామినేషన్స్ లో అనిల్‌, నటరాజ్‌, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్‌, అరియానా, మహేశ్‌ విట్టా ఉండగా వీరిలోంచి మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు.

Samantha: ‘శాకుంతలం’కు శుభం కార్డు వేసిన సమంత!

గతంలో కూడా బిగ్‌బాస్‌ లో అలరించాడు మహేష్ విట్టా. ప్రస్తుతం మహేష్ హీరోగా ఒక సినిమా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తున్నాడు. అంతేకాక బిగ్‌బాస్‌ కి వెళ్లేముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సంవత్సరం పెళ్లి కూడా చేసుకుంటాను అని తెలిపాడు. మరి ఈ సంవత్సరం పెళ్లి బాజాలు మోగించి, హీరోగా సినిమా కూడా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు మహేష్.