RGV : నాకు 50 వేలు ఇవ్వకుండా ఆర్జీవీ మోసం చేశారు : మహేశ్వరి
ఇటీవల 'ఆలీతో సరదాగా' షోకి గెస్ట్ గా వచ్చిన మహేశ్వరి అనేక ఆసక్తికర విషయాలని పంచుకుంది. ఇందులో భాగంగానే ఆర్జీవీ తనకి 50 వేలు బాకీ ఉన్న సంగతి తెలిపింది. మహేశ్వరి దీని గురించి చెప్తూ..

Maheshwari : 90లలో హీరోయిన్ మహేశ్వరి చేసింది తక్కువ సినిమాలైనా ఫుల్ క్రేజ్ తెచ్చుకొని అభిమానులని సంపాదించుకుంది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘గులాబీ’ సినిమాతో స్టార్ అయింది మహేశ్వరి. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాలోని ‘మేఘాలలో..’,’ఈవేళలో నీవు’.. లాంటి సాంగ్స్ ఇప్పటికి క్లాసిక్ గా నిలిచాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి సినీ పరిశ్రమకు దూరమయింది.
ఇటీవల ‘ఆలీతో సరదాగా’ షోకి గెస్ట్ గా వచ్చిన మహేశ్వరి అనేక ఆసక్తికర విషయాలని పంచుకుంది. ఇందులో భాగంగానే ఆర్జీవీ తనకి 50 వేలు బాకీ ఉన్న సంగతి తెలిపింది. మహేశ్వరి దీని గురించి చెప్తూ.. ”దెయ్యం సినిమా షూటింగ్ మేడ్చల్‌లోని ఓ పాడుపడ్డ ఫామ్‌హౌస్‌లో చేశారు. అక్కడ స్మశానం సెట్ వేశారు. అక్కడి నుంచి మెయిన్ రోడ్‌కి సుమారు 2 కిలోమాటర్ల దూరం ఉంటుంది. ఆ ప్రాంతం అంతా పొడవాటి చెట్లతో భయంకరంగా ఉంటుంది. రాత్రి 1గంటకి షూటింగ్. అప్పుడు వర్మ మీలో ఎవరైనా మెయిన్ రోడ్ వరకు వెళ్లొస్తే 50వేలు ఇస్తానని పందెం కట్టారు. నేను వెళ్తా అని చెప్పి భయపడుతూనే వెళ్లి వచ్చాను. కానీ ఆయన ఇస్తానన్న 50వేలు మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు.” అని తెలిపారు.
Anchor Shyamala : కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన యాంకర్ శ్యామల
ఇప్పటికి కూడా ఆర్జీవీ ఎక్కడైనా కనపడితే కచ్చితంగా ఆ 50 వేలు అడుగుతాను అని నవ్వుతే చెప్పింది మహేశ్వరి. దీంతో ఆలీ ఆర్జీవిని ఆ డబ్బులు ఇచ్చేయమని లేకపోతే ఇంటికి వచ్చి తీసుకుంటామని నవ్వుతూ టీవీ నుంచే చెప్పారు. అలా మహేశ్వరి తన సినిమాల గురించి, అప్పటి సంఘటనల గురించి ప్రేక్షకులకి తెలియచేసింది.
- RGV : నేను మంచి కొడుకుని కాదు.. హ్యాపీ మదర్స్ డే.. ఆర్జీవీ వింత ట్వీట్..
- RGV: ‘డేంజరస్’గా మారిన నట్టి కుమార్.. కోర్టులోనే తేల్చుకుంటానంటోన్న వర్మ!
- RGV : లేడీ సర్కార్ అంటూ.. విశ్వక్ సేన్, యాంకర్ గొడవపై కామెంట్స్ చేసిన ఆర్జీవీ..
- RGV: సౌత్ VS నార్త్ మూవీ వార్.. హిందీ వాళ్ళకి జెలసీ అంటున్న వర్మ!
- RGV : హిందీ సినిమాలకి వైరస్ పట్టింది
1Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
2Elon musk: ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం అసాధ్యమేనా? స్పష్టత ఇచ్చిన ఎలన్ మస్క్
3Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
4జగన్ నీ పతనం మొదలైంది..!
5Boney Kapoor : బోనికపూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 లక్షలు చోరీ.. పోయినట్టు కూడా తెలీదు..
6వైసీపీపై రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం
7మహానాడు వేదికగా చంద్రబాబు సవాల్…!
8కమ్మ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నమా..?
9Delhi : నైజీరియా వ్యక్తి నిర్వాకం..పెళ్లి పేరుతో 300 మంది భారతీయ మహిళలను మోసగించి..రూ.కోట్లు దోచేసిన ఘనుడు
10తారక మంత్రం జపిస్తున్న టీఆర్ఎస్ నేతలు
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు