Mahika Sharma: హీరోయిన్స్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వేశ్యలు.. మహికా షాకింగ్ కామెంట్స్!

ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మహిళలను ఎప్పుడూ లైంగిక వస్తువులుగా చూస్తారంటూ నటి మహికా శర్మ అభిప్రాయపడ్డారు. సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు, అవకాశాలు గురించి మాట్లాడుతూ మహికా శర్మ పలు వ్యాఖ్యలు చేశారు.

Mahika Sharma: హీరోయిన్స్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వేశ్యలు.. మహికా షాకింగ్ కామెంట్స్!

Mahika

Heroines are upper class prostitutes: ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మహిళలను ఎప్పుడూ లైంగిక వస్తువులుగా చూస్తారంటూ నటి మహికా శర్మ అభిప్రాయపడ్డారు. సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు, అవకాశాలు గురించి మాట్లాడుతూ మహికా శర్మ పలు వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ సినిమాల్లో మంచి పాత్రల్లో నటించిన మహికా.. హీరోయిన్లంటే అప్పర్ క్లాస్ వేశ్యలు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. వ్యభిచారం అనేది ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నా.. ఈ రంగుల ప్రపంచంలో ఉన్న హీరోయిన్లపైనే అందరి ఫోకస్ ఉంటుందని అన్నారు ఆమె.

సినిమా ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం జరిగినా కూడా ఎగ్జైట్ అయిపోయి అతి చేసేవారు ఎక్కువగా కనిపిస్తుంటారని మహికా అన్నారు. ఈ ఇండస్ట్రీలో నిలబడాలంటే తాము ఏదో ఒకటి త్యాగం చేస్తేనే సాధ్యమైంది తప్ప ఊరికే అవకాశాలు రావని, వచ్చే అవకాశం కూడా లేదని అన్నారు మహికా.

అవకాశాల వేటలో భాగంగా చాలామంది నటీమణులు కాస్టింగ్ డైరెక్టర్ లేదా నిర్మాతలకు బలవుతూ ఉన్నారని, కొత్తవాళ్ల పరిస్థితి అయితే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని అన్నారు.

సమాజం కూడా నటించేవారిని చూసే కోణం వేరేగా ఉందని, తన కెరీర్‌లో కూడా ఎన్నో చేదు అనుభవాలు ఎదురైనట్లు మహిక చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలోని హీరోయిన్స్ హై క్లాస్ ప్రాస్టిట్యూట్స్ అన్నట్లుగా జనం భావిస్తుంటారని, అందుకే హీరోయిన్లు అంటే క్రేజ్ తప్ప గౌరవం సమాజంలో వాళ్లకు దక్కట్లేదని కుండబద్దలు కొట్టారు. మరికొద్ది రోజుల్లో ‘ది మోడ్రన్ కల్చర్’ సినిమాతో మహిక ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.