Major: ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌తో అదరగొట్టిన మేజర్!

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించగా....

Major: ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌తో అదరగొట్టిన మేజర్!

Major First Week Worldwide Collections

Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించగా, ముంబై దాడుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగింది. ఇక మేజర్ సందీప్ జీవితాన్ని మన కళ్లకు కట్టినట్లుగా చూపించడం.. ఆయన ఉగ్రదాడిలో మృతిచెందిన ఘటనను మనకు మళ్లీ గుర్తు చేసి మరోసారి ఆయనపై ఉన్న గౌరవాన్ని పెంచేలా చేసింది ఈ మూవీ. దీంతో మేజర్ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు జై కొట్టారు.

Major: యూఎస్‌లో మైల్‌స్టోన్ మార్క్ క్రాస్ చేసిన మేజర్

ఫలితంగా ఈ సినిమాకు అన్ని చోట్లా ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక కమర్షియల్ గానూ ఈ సినిమాకు అదిరిపోయ వసూళ్లు వస్తున్నాయి. ఈ సినిమాకు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి కలెక్షన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. కాగా.. ఈ సినిమా ఫస్ట్ వీక్ థియేట్రికల్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.25 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించింది. అటు గ్రాస్ పరంగా ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Major: మేజర్ టీమ్‌కు హ్యాట్సాఫ్..!

మేజర్ సందీప్ పాత్రలో అడివి శేష్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ సాయీ మంజ్రేకర్, శోభిత దూళిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి ఈ సినిమాలో ప్రాణం పెట్టి నటించడంతో మేజర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తొలివారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 6.66 కోట్లు
సీడెడ్ – 1.90 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.25 కోట్లు
గుంటూరు – 0.97 కోట్లు
ఈస్ట్ – 0.85 కోట్లు
వెస్ట్ – 0.74 కోట్లు
కృష్ణా – 0.93 కోట్లు
నెల్లూరు – 0.38 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 14.68 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 6 కోట్లు
ఓవర్సీస్ – 5 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.25.68 కోట్లు