Major: యూఎస్‌లో మైల్‌స్టోన్ మార్క్ క్రాస్ చేసిన మేజర్

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ మూవీగా తెరకెక్కిన ‘మేజర్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా....

Major: యూఎస్‌లో మైల్‌స్టోన్ మార్క్ క్రాస్ చేసిన మేజర్

Major Movie Crossed 1 Million Dollar Mark At Usa Box Office

Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ మూవీగా తెరకెక్కిన ‘మేజర్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించగా, యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ఈ సినిమాలో మేజర్ పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.

Major: ఓవర్సీస్‌లో మైల్‌స్టోన్ మార్క్ దిశగా మేజర్

అటు కలెక్షన్స్ పరంగా కూడా మేజర్ చిత్రం మంచి వసూళ్లు రాబడుతూ రెండో వారంలోకి ఎంటర్ అయ్యింది. ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్దే కాకుండా, యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. తాజాగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మైల్‌స్టోన్ మార్క్‌ను క్రాస్ చేసి తన సత్తా చాటింది. మేజర్ చిత్రం యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంటర్ అయ్యింది. మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని మరోసారి మేజర్ ప్రూవ్ చేసిందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

Major Movie : అల్లు అర్జున్ కి థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఎందుకో తెలుసా??

ఇక మేజర్ చిత్రంలో సాయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, ఈ సినిమాను సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏప్లస్ఎస్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి. మేజర్ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కించి పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.