Adivi Sesh : పాఠశాల విద్యార్థులకు ‘మేజర్’ బంపర్ ఆఫర్..
తాజాగా మేజర్ చిత్ర యూనిట్ పాఠశాల విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి పాఠశాల విద్యార్థులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో.............

Major : 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్. అడవి శేష్ హీరోగా, శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో మహేష్ బాబు నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమైంది. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని భారీ విజయం సాధించి అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తుంది ఈ సినిమా. మేజర్ సినిమాపై ప్రేక్షకులు, సెలబ్రిటీలు, సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా మేజర్ చిత్ర యూనిట్ పాఠశాల విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి పాఠశాల విద్యార్థులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో టికెట్ ధరపై 50 శాతం రాయితీ ఇస్తోంది. పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక షో కోసం majorscreening@gmail.com కి మెయిల్ చేస్తే మేజర్ టీమ్ ఆ స్కూల్ విద్యార్థులకు స్పెషల్ షో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Satyadev : ఈ సినిమాకి నాథూరామ్ గాడ్సే కథకు ఎలాంటి సంబంధం లేదు.. పవన్ కోసం రాసిన సినిమా..
దీనికి సంబంధించి అడివిశేష్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అడివిశేష్ మాట్లాడుతూ.. ”మేజర్ సినిమాకి ఇంతటి భారీ విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులందరికి ధన్యవాదాలు. కొన్ని రోజులుగా చాలామంది చిన్నారులు నాకు ఫోన్ చేసి, సోషల్ మీడియాలో మెసేజ్ లు చేసి సినిమా గురించి మాట్లాడుతున్నారు. వాళ్లందరికీ కూడా మేజర్ సినిమా బాగా నచ్చింది. మేమూ మేజర్ సందీప్‌లా దేశం కోసం పోరాడతమని వాళ్ళు చెప్పడం సంతోషాన్నిచ్చింది. ఈ చిత్రం పిల్లలకు కూడా ఇంత బాగా నచ్చుతుందని మేము అనుకోలేదు. ఈ స్పందన చూసి మేం ఓ నిర్ణయం తీసుకున్నాం. మరింతమంది విద్యార్థులు మేజర్ గురించి తెలుసుకుని స్ఫూర్తిపొందాలని, గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నాం. రేపటి తరానికి మేజర్ సందీప్ గురించి తెలియాలనేదే మా లక్ష్యం’’ అని తెలిపారు.
Team #MajorTheFilm 🇮🇳 has some exciting news for all the children and schools ❤️
Witness the Life of Major Sandeep Unnikrishnan on Big Screens with 50% discount on tickets 💥💥
School management can write to majorscreening@gmail.com and register yourself for the special show. pic.twitter.com/VOmKYhgZXd
— GMB Entertainment – MajorTheFilm In CINEMAS NOW (@GMBents) June 14, 2022
1Presidential polls: రాష్ట్రపతి ఎన్నిక కోసం 72 మంది నామినేషన్లు
2Maharashtra: మంత్రి పదవులపై బీజేపీతో చర్చలు జరగలేదు: ఏక్నాథ్ షిండే
3Searching For Tiger: పులి ఎటు వెళ్లింది..? పులి జాడకోసం కొనసాగుతున్న వేట..
4Udaipur: ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత.. ఆందోళనకారుల్ని అదుపు చేసిన పోలీసులు
5Andra pradesh : ప్రధాని పాల్గొనే అల్లూరి జయంతి వేడుకలకు రావాలని చంద్రబాబుకు మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
6Gopichand : పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టలో తెలుసా??
7PAN-Aadhaar: పాన్‌కార్డ్-ఆధార్ లింక్‌కు నేడే చివరి రోజు.. లేకుంటే వెయ్యి జరిమానా
8Gas Problem: కడుపులో గ్యాస్ సమస్యగా మారిందా.. జాగ్రత్తలివే
9PM Modi: మోదీ బస చేసేది రాజ్‌భవన్‌లో కాదు.. ఎస్పీజీ సూచనలతో ప్లేస్ మార్చేశారు.. ఎక్కడంటే?
10Auto Catches Fire In AP : ఆటో ప్రమాదం పాపం ‘ఉడుత’దే..మా తప్పేమీ లేదు : ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ
-
Rheumatic Fever : చిన్నారుల గుండెపై ప్రభావం చూపే రుమాటిక్ ఫీవర్!
-
Jack Fruit : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పనస పండు!
-
Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్