Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..
మేజర్ సినిమాకి అడివి శేష్ మరో అడుగు ముందుకేసి మా టికెట్ రేట్లు ఇంతే. టికెట్ రేట్లు పెంచట్లేదు. మాకు డబ్బుల కంటే కూడా ఇలాంటి గొప్ప వ్యక్తి జీవిత కథ............

Major : 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ కృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ‘మేజర్’. అడివి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా మహేష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా హీరో అడివి శేష్ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ చెప్పి కొత్తగా సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.
ఇటీవల కరోనా తర్వాత పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు భారీగా పెంచిన సంగతి తెలిసిందే. కొన్ని డబ్బింగ్ సినిమాలకి కూడా థియేటర్ టికెట్ రేట్లు పెంచారు. దీంతో కలెక్షన్స్ రావడం పక్కన పెడితే జనాలు కొన్ని సినిమాలని పట్టించుకోలేదు కూడా. దీంతో టికెట్ రేట్లు పెంచడంపై వ్యతిరేకత, థియేటర్ కి జనాలు రాకపోవడంతో టాలీవుడ్ వర్గాలకు అర్థమయి ఇప్పుడు వచ్చే సినిమాలకి టికెట్ రేట్లు పెంచే సాహసం చేయట్లేదు. ఇటీవల వచ్చిన F3 సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచలేదు అని దిల్ రాజు సరికొత్త ప్రమోషన్ తో జనాల్ని థియేటర్ కి రప్పించడానికి ప్రయత్నించాడు.
ఇక మేజర్ సినిమాకి అడివి శేష్ మరో అడుగు ముందుకేసి మా టికెట్ రేట్లు ఇంతే. టికెట్ రేట్లు పెంచట్లేదు. మాకు డబ్బుల కంటే కూడా ఇలాంటి గొప్ప వ్యక్తి జీవిత కథ ప్రజలకు దగ్గరవ్వడం ముఖ్యం అంటూ ఏపీ, తెలంగాణ రేట్లను పోస్టర్ పై ప్రదర్శించి మరీ ప్రమోట్ చేస్తున్నాడు. అందరికి టికెట్ రేట్లు అందుబాటులో ఉండేలా, అన్ని సినిమాలకంటే తక్కువ రేటు ఉండేలా చూసుకున్నాం అంటూ అడివి శేష్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాడు. అడివి శేష్ చెప్పిన లెక్కల ప్రకారం సింగిల్ స్క్రీన్: తెలంగాణలో రూ.150 కాగా, ఏపీలో రూ. 147గా ఉన్నాయి. మల్టీప్లెక్స్: తెలంగాణలో రూ.195 కాగా ఏపీలో రూ.177గా ఉన్నాయి. ఈ టికెట్ రేట్లు కూడా అధికారికంగా పోస్ట్ చేసాడు శేష్.
NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న 9 ప్రధాన నగరాల్లో రోజుకొక చోట ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి ఈ ప్రివ్యూలు వేస్తుండగా వీటికి మంచి స్పందన లభిస్తుంది. జూన్ 3 నుంచి మజార్ సినిమా ప్రేక్షకులందర్నీ థియేటర్లలో పలకరించనుంది ఈ సినిమా.
#MajorTheFilm MANA cinema. So, we decided to give you the LOWEST PRICES for ANY film post pandemic. https://t.co/aAUhmKEO9u
Sharing my love ❤️ Sharing my heart. pic.twitter.com/wWPHLD4GOK
— Adivi Sesh (@AdiviSesh) May 27, 2022
- Major : పవన్ తనయుడిలో ఈ ట్యాలెంట్ చూస్తే ఆశ్చర్యపోతారు.. మేజర్ సాంగ్ కంపోజ్ చేసిన అకిరా..
- Adivi Sesh : నాకు ఆయనలా లవ్ అఫైర్లు లేవు.. కానీ లవ్ లో దెబ్బ తిన్నాను..
- Mahesh Babu: యాక్షన్‌తోనే మహేష్ యాక్షన్ షురూ..?
- Mahesh Babu: ఆ డైరెక్టర్‌తో హ్యాట్రిక్ కొడతానంటోన్న మహేష్..?
- Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అందులోనే..
1Rakhi Sawant : నేనెలాంటి బట్టలు వేసుకోవాలో నా ప్రియుడే డిసైడ్ చేస్తాడు..
2Ammavodi: వరుసగా మూడో ఏడాది అమ్మఒడి అందుకుంటున్న శ్రీకాకుళం
3Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
4Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు
5Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
6Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??
7Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
8Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
9Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
10Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?