Major: మేజర్ కూడా రెడీ.. కాస్కోండి అంటోన్న నెట్‌ఫ్లిక్స్!

బయోపిక్ చిత్రాలకు ప్రేక్షకుల నుండి ఎప్పటికీ పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుంది. అది లెజెండరీ యాక్టర్ సావిత్రి ‘మహానటి’ మొదలుకొని, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ‘కిల్లింగ్ వీరప్పన్’....

Major: మేజర్ కూడా రెడీ.. కాస్కోండి అంటోన్న నెట్‌ఫ్లిక్స్!

Major Movie To Stream From July 3 On Netflix

Major: బయోపిక్ చిత్రాలకు ప్రేక్షకుల నుండి ఎప్పటికీ పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుంది. అది లెజెండరీ యాక్టర్ సావిత్రి ‘మహానటి’ మొదలుకొని, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ‘కిల్లింగ్ వీరప్పన్’ వరకు ఎలాంటి నిజజీవిత కథ అయినా, అందులో దమ్ముంటే, అది ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతుంది. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ మూవీ ‘మేజర్’. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ మెయిల్ లీడ్‌లో నటించిన ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించగా, భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

Major: మేజర్ సినిమాపై ‘మెగా’ కామెంట్.. ఏమన్నారంటే?

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయగా, ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ జీవితకథ కావడంతో ఈ సినిమాను చూసేందుకు యావత్ దేశప్రజలు ఆసక్తిని కనబరిచారు. అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ దక్కింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యింది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్. ఈ సినిమా రిలీజ్ అయిన నెలరోజుల తరువాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేసేటట్టు ఒప్పందం కుదుర్చుకోవడంతో, జూలై 3న ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.

Major : అడివిశేష్ లాంటి వాళ్ళు మరింతమంది సినిమాల్లోకి రావాలి.. మేజర్ సినిమాపై పవన్ ప్రశంసలు..

ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ మూవీలన్నీ కూడా ఒకే వారంలో ఓటీటీ స్ట్రీమింగ్‌లో వచ్చేస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విరాటపర్వం, విక్రమ్ ఇలా వరుసగా ఇటీవల రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలోకి ఒకే వారంలో ఎంట్రీ ఇస్తుండగా, ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో మేజర్ కూడా వచ్చి చేరింది. అటు థియేటర్లలో పక్కా కమర్షియల్ అంటూ గోపీచంద్ సందడి చేయనుండగా, ఓటీటీలో మాత్రం ప్రేక్షకులకు ఫుల్ స్టఫ్ దొరకనుందని చెప్పాలి. మరి మేజర్ చిత్రానికి ఓటీటీ ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్‌ను కట్టబెడతారో చూడాలి.