Bheemla Nayak: ఎప్పుడు 50శాతం ఆక్యుపెన్సీ తీసేస్తే అప్పుడే భీమ్లా నాయక్ రిలీజ్!

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్.. టాలీవుడ్ ప్రక్షకులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న సినిమా ఇది.

Bheemla Nayak: ఎప్పుడు 50శాతం ఆక్యుపెన్సీ తీసేస్తే అప్పుడే భీమ్లా నాయక్ రిలీజ్!

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్.. టాలీవుడ్ ప్రక్షకులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు విడుదల తేదీలు ఖరారయ్యాయి కానీ, వాయిదా పడుతూనే వస్తోంది. లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించి రెండు రిలీజ్ డేట్‌లను కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

లేటెస్ట్‌గా ఈ సినిమా విడుదలపై చిత్రనిర్మాత నాగ వంశీ కామెంట్స్ చేశారు. డీజే టిల్లూ మూవీ ట్రైలర్ లాంఛ్ ఇవెంట్‌లో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో 50శాతం ఆక్యుపెన్సీ ఏప్పుడు తీసేస్తే అప్పుడు భీమ్లా నాయక్ రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. భీమ్లా నాయక్ మంచి ఆంధ్ర భోజనం లాంటి మాసివ్ మూవీ అని వంశీ చెప్పారు.

నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు త్రివిక్రమ్‌ అందించగా.. సితార ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మలయాళ సూపర్‌ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కి రీమేక్‌ మూవీ ఇది.