Malaika Arora: మాజీ భర్తతో విమానాశ్రయంలో మలైకా.. ఫోటోలు వైరల్!

బాలీవుడ్ నటి మలైకా అరోరా ఈ మధ్య కాలంలో ఎక్కడా చూసినా ప్రియుడు అర్జున్ కపూర్ తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం.. వీలైతే విహార యాత్రలకి చెక్కేసి అక్కడ రచ్చ చేస్తూ బీచ్ లో..

Malaika Arora: మాజీ భర్తతో విమానాశ్రయంలో మలైకా.. ఫోటోలు వైరల్!

Malaika Arora

Malaika Arora: బాలీవుడ్ నటి మలైకా అరోరా ఈ మధ్య కాలంలో ఎక్కడా చూసినా ప్రియుడు అర్జున్ కపూర్ తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం.. వీలైతే విహార యాత్రలకి చెక్కేసి అక్కడ రచ్చ చేస్తూ బీచ్ లో బికినీతో ఫోటో షూట్లు చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేయడమే చూస్తున్నారు. పండగలు, వేడుకలకు కూడా ఈ జంట స్పెషల్ అట్రాక్షన్ గా మారుతూ బీ టౌన్ లో ఎక్కడా చూసినా వీరి గురించే చర్చ జరుగుతుంది. లేటు వయసు ఘాటు రొమాన్స్ అంటూ మలైకాను నెటిజన్లు భీబత్సంగా ట్రోల్స్ కూడా కామన్ గా మారిపోయాయి.

Pushpa-Samantha: స్పెషల్ సాంగ్ కూడా కాపీనేనా.. దేవిశ్రీపై ఆగని ట్రోల్స్!

అయితే, మలైకా ప్రియుడితో కాకుండా ఈసారి మాజీ భర్త, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తో విమానాశ్రయంలో కనిపించింది. దీంతో ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా.. ఈ మాజీ భార్య-భర్తలు ఇలా విమానాశ్రయంలో కనిపించడానికి కారణం వీళ్ళ కుమారుడు అర్హన్. చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లిన అర్హాన్‌.. క్రిస్టమస్‌ సెలవుల సందర్భంగా తాజాగా ఇండియా వచ్చాడు. దీంతో కుమారుడిని రిసీవ్‌ చేసుకోవడం కోసం మలైకా-అర్బాజ్‌ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు.

Prabhas-Nithya Menen: ప్రభాస్‌ ఇష్యూ నన్ను ఇప్పటికీ బాధ పెడుతుంది: నిత్యా మీనన్

గతంలో కూడా ఒకసారి ఇలా ఈ మాజీ దంపతులు ఇద్దరూ కొడుకుతో కలిసి డిన్నర్ కి వెళ్లగా ఇప్పుడు ఇలా ఎయిర్ పోర్ట్ లో కలిశారు. ఇక, చాలా కాలం తర్వాత అర్హాన్‌ని చూసి మలైకా భావోద్వేగానికి గురై కుమారుడిని కౌగిలించుకుని కంట తడిపెట్టగా.. అర్బాజ్‌ కూడా అర్హాన్‌ను కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేశాడు. వీరు ముగ్గురు కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతుండగా ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మలైకా-అర్బాజ్‌ 18 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2017లో విడాకులు తీసుకోగా ప్రస్తుతం మలైకా హీరో అర్జున్‌ కపూర్‌తో.. అర్బాజ్‌ ఇటాలియన్‌ మోడల్‌తో రిలేషన్‌లో ఉన్నారు.