Malaika Arora : మాజీ భర్తపై మలైకా పొగడ్తలు..

తాజాగా మూవింగ్ ఇన్ విత్ మలైకా షోలో తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ గురించి మాట్లాడుతూ.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేనే అర్బాజ్ కి ప్రపోజ్ చేశాను. పెళ్లి చేసుకుందామని అడిగాను. తను..................

Malaika Arora : మాజీ భర్తపై మలైకా పొగడ్తలు..

Malaika Arora comments on her ex husband

Malaika Arora :  49 ఏళ్ళు వచ్చినా ఇంకా హాట్ హాట్ డ్రెస్సులతో, ఐటెం సాంగ్స్ తో కుర్రాళ్ళని కవ్విస్తుంది బాలీవుడ్ భామ మలైకా అరోరా. తనకంటే చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలే మూవింగ్ ఇన్ విత్ మలైకా అనే షో ప్రారంభించింది. హాట్ స్టార్ ఓటీటీలో ఈ షో స్ట్రీమ్ అవుతుంది.

మూవింగ్ ఇన్ విత్ మలైకా షోలో తన జీవితంలోని అనుభవాలని, విశేషాలని షేర్ చేసుకోవడమే కాకుండా వచ్చే గెస్టుల గురించి విశేషాలు, అలాగే హాట్ టాక్స్ కూడా మాట్లాడుతుంది. తాజాగా ఈ షోలో తన మాజీ భర్తపై ప్రశంసలు కురిపించింది. నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ ని 1998లో పెళ్లి చేసుకుంది మలైకా. దాదాపు 19 సంవత్సరాలు వీరి బంధం సాగి 2017లో విడాకులు తీసుకున్నారు.

Eeshwari Rao : ప్రభాస్, సలార్ సినిమాపై నటి ఈశ్వరీరావు కామెంట్స్..

తాజాగా మూవింగ్ ఇన్ విత్ మలైకా షోలో తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ గురించి మాట్లాడుతూ.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేనే అర్బాజ్ కి ప్రపోజ్ చేశాను. పెళ్లి చేసుకుందామని అడిగాను. తను ఓకే అన్నాడు. కాకపోతే జీవితంలో కొన్ని భిన్నమైన అంశాలు ఇద్దరూ కోరుకోవడంతో విడిపోయాం. అర్బాజ్ చాలా మంచివాడు. నన్ను చాలా మార్చాడు. నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే తానే కారణం. ఇటీవల నేను ప్రమాదానికి గురయినప్పుడు కూడా నన్ను చూడటానికి హాస్పిటల్ కి వచ్చాడు అని తెలిపింది. దీంతో అంత మంచోడు అయితే ఎందుకు విడాకులు ఇచ్చావు, అర్జున్ కపూర్ తో ఎందుకు డేటింగ్ చేస్తున్నావు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.