Malavika Mohan : షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్ మాళవిక మోహన్

తాజాగా ‘యుద్ర’ సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంటే మాళ‌విక గాయ‌ప‌డింది. చేతికి, కాలికి దెబ్బ‌లు తగిలాయి. వాటికి సంబంధించిన ఫొటోలు.......

Malavika Mohan : షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్ మాళవిక మోహన్

Malavika

Malavika Mohan :  సినిమా షూటింగ్స్ లో ఒక్కోసారి ప్రమాదాలు ఎదురవుతాయి. సినిమా కోసం కొంతమంది ఆర్టిస్టులు రిస్కులు చేస్తారు. ఈ రిస్కులు చేసే టైంలో ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు ఎదురవుతాయి. చాలా మంది ఆర్టిస్టులు షూటింగ్ సమయంలో గాయపడుతూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంటే గాయపడింది.

Sirivennela : ‘సిరివెన్నెల’ నటించిన ఒకేఒక్క సినిమా ఏంటో తెలుసా?… అది కూడా ఆర్జీవీ దర్శకత్వంలో

తమిళ్, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక మోహన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన ఫోటోలను రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో కూడా పాతుకుపోవడానికి ట్రై చేస్తుంది. ఇటీవల రజినీకాంత్ ‘పేట’, విజయ్ ‘మాస్టర్’ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్ర‌స్తుతం హీరో ధనుష్‌ తో ‘మారన్‌’లో, బాలీవుడ్ లో సిద్ధార్థ్‌ చతుర్వేది సరసన ‘యుద్ర’లో నటిస్తోంది.

Sirivennela : సిరివెన్నెల పాటల పూదోటలో వికసించిన అవార్డులు..

తాజాగా ‘యుద్ర’ సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంటే మాళ‌విక గాయ‌ప‌డింది. చేతికి, కాలికి దెబ్బ‌లు తగిలాయి. వాటికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. యాక్ష‌న్ సినిమా షూటింగ్‌లో గాయాలు త‌గులుతుంటాయి అని పేర్కొంది. ఆ ఫోటోలను చూసి ఆమెకు సినిమాపై ఉన్న అంకితభావాన్ని మెచ్చుకుంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)