Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం ప్రభాస్ హీరోయిన్‌ను పట్టుకొస్తున్నారా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పూర్తి పీరియాడికల్ ఫిక్షన్ కథతో చిత్ర యూనిట్ ఈ సినిమాను రూపొందిస్తోంది. ఈ సినిమా పూర్తిగాక ముందే, పవన్ తన నెక్ట్స్ ప్రాజెక్టులను వరుసబెట్టి ఓకే చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ అనే సినిమాను స్టార్ట్ చేసిన పవన్, ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం ప్రభాస్ హీరోయిన్‌ను పట్టుకొస్తున్నారా..?

Malavika Mohanan To Romance Pawan Kalyan After Prabhas

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పూర్తి పీరియాడికల్ ఫిక్షన్ కథతో చిత్ర యూనిట్ ఈ సినిమాను రూపొందిస్తోంది. ఈ సినిమా పూర్తిగాక ముందే, పవన్ తన నెక్ట్స్ ప్రాజెక్టులను వరుసబెట్టి ఓకే చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ అనే సినిమాను స్టార్ట్ చేసిన పవన్, ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

Pawan Kalyan: మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన పవన్.. ఆ డైరెక్టర్‌తో మూవీకి సిద్ధం..?

ఈ సినిమాతో పాటు తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్‌లో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. అటు మరో యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలోనూ OG అనే సినిమాను స్టార్ట్ చేశాడు. అయితే ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వనిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా ఇప్పటికే యంగ్ బ్యూటీ శ్రీలీలను తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమెతో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan: కన్నడ డైరెక్టర్‌తో పవన్.. బాక్సాఫీస్‌ను ‘కబ్జా’ చేసేందుకు రెడీ అవుతున్నారా..?

తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ, తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఈ బ్యూటీకి, పవన్ సినిమాలో ఛాన్స్ వస్తే అది నిజంగా ఆమె అదృష్టం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.