Harish Pengan: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు హరీష్ పెంగన్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు హరీష్ పెంగన్(Harish Pengan) కన్నుమూశారు.

Malayalam actor Harish Pengan
Malayalam actor Harish Pengan: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు హరీష్ పెంగన్(Harish Pengan) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 49 సంవత్సరాలు. రేపు నటుడి స్వగ్రామమైన నెడుంబస్సేరిలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Venkatesh : ప్రభుత్వం ఇస్తే ఇవ్వొచ్చు.. లేదంటే లేదు.. నంది అవార్డులపై వెంకటేష్ కామెంట్స్!
ఈ నెల ప్రారంభంలో కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. కాలేయాన్ని దానం చేసేందుకు సోదరి శ్రీజ ముందుకు వచ్చింది. అయితే.. అందుకు అవసరమైన నగదు వారి వద్ద లేదు. దీంతో ఆస్పత్రిలో చేరిన తర్వాత చికిత్స, కాలేయ మార్పిడి కోసం అవసరమైన ఆర్థిక సాయం కోసం అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓ పక్క నిధుల సేకరణ కొనసాగుతుండగానే ఆయన మరణించారు.
‘మహేశింటే ప్రతీకారం’, ‘షెఫీక్కింటే సంతోషం’, ‘వెల్లారి పట్టణం’, ‘జయ జయ జయ జయ హే’, ‘ప్రియన్ ఒట్టతిలను’, ‘మిన్నల్ మురళి’,’జో అండ్ జో’ వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హరీశ్ అకాల మరణం పట్ల ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) సభ్యులు, నటులు టోవినో థామస్, అజు వర్గీస్ నటుడి సంతాపం తెలియజేశారు.
Kamal – Rajini : కమల్ హాసన్‌తో రజినీకాంత్ సినిమా.. కన్‌ఫార్మ్ చేసిన లోకనాయకుడు!
View this post on Instagram