Mee Too : ఇప్పటికి 10మంది మహిళలతో శారీరక సంబంధం ఉంది.. అదే “మీటూ” అయితే కొనసాగిస్తా

ప్రముఖ మలయాళ నటుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ వినాయకన్‌ మీ టూపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. తను 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానంటూ అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కేరళలో

Mee Too : ఇప్పటికి 10మంది మహిళలతో శారీరక సంబంధం ఉంది.. అదే “మీటూ” అయితే కొనసాగిస్తా

Mee Too Vinayakan

Mee Too : ప్రముఖ మలయాళ నటుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ వినాయకన్‌ మీ టూపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. తను 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానంటూ అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కేరళలో తీవ్ర దూమారం రేపుతున్నాయి.  వినాయకన్‌ తాజా సినిమా  ఒరుతె ప్రమోషన్‌   కార్యక్రమంలో ఉండగా ఓ మహిళా జర్నలిస్ట్ ఒకరి వద్ద నుంచి అతనికి మీ టూపై ఈ ప్రశ్న ఎదురయ్యింది.

అతడు స్పందించిన తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు మలయాళ పరిశ్రమకు చెందిన నటీనటులు సైతం వినాయకన్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఒరుతె  ప్రమోషన్‌ కార్యక్రమంలో వినాయకన్‌తో ఆ చిత్ర బృందం పాల్గొంది.  ఈ సందర్భంగా మీ టూ ఉద్యమంపై ఆయన అభిప్రాయం అడగ్గా.. మీటూ అంటే తనకు తెలియదని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

‘మీ టూ ఉద్యమం అంటే ఏమిటో నాకు తెలియదు. ఒక మహిళను నాతో శృంగారం చేస్తావా? అని అడగడం మీ టూ అయితే. నేను దానిని అలాగే కొనసాగిస్తాను’ అంటూ వినాయకన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక ఇది కేవలం మహిళలకు సంబంధించిన విషయమేనా? అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటూ వినాయకన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి. అదే మీటూ అయితే తన జీవితంలో ఇప్పటి వరకు 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానని, వారందరిని నాతో గడుపుతారా? అని అడిగానని చెప్పాడు.

ఇదే మీ టూ అయితే ఇకముందు కూడా తాను అలాగే చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. మీటూ పై  అతడి వ్యవహార శైలి చూసిన నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. మీ టూపై సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని  వినాయకన్‌పై పలువురు  ఆగ్రహం వెలిబుచ్చారు.  కాగా వినాయకన్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. 2019లో మృదులదేవి అనే దళిత మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయి అతడు జైలుకు వెళ్లాడు.
Also Read  : Kodanda Ram : టీజేఎస్ పార్టీ విలీనం..? లేదన్న కోదండరాం
ఇప్పుడు మరోసారి మీ టూపై ఈ తరహా వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదంలో నిలిచాడు. మరోవైపు బాలీవుడ్‌ నుంచి సౌత్‌ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసిన ‘మీ టూ ఉద్యమం’పై ప్రముఖ నటుడైన వినాయకన్‌ ఈ విధంగా స్పందించడంపై సినీ సెలెబ్రెటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం వినాయకన్ మీటూ గురించి చేసిన వ్యాఖ్యల పట్ల, ఆ మహిళ విలేకరికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని ఫేస్ బుక్ లో    క్షమాపణలు చెప్పాడు.