Agent Movie : అఖిల్ కోసం స్టైలిష్ విలన్ గా మలయాళం సూపర్ స్టార్.. ‘ఏజెంట్’ విలన్ స్టైలిష్ లుక్ లీక్..

ఇటీవలే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో ఫస్ట్ టైం హిట్ కొట్టాడు అఖిల్. ఈ సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్ సురేందర్ రెడ్డితో 'ఏజెంట్' సినిమాని అనౌన్స్ చేసాడు అఖిల్. ఇప్పటికే

Agent Movie : అఖిల్ కోసం స్టైలిష్ విలన్ గా మలయాళం సూపర్ స్టార్.. ‘ఏజెంట్’ విలన్ స్టైలిష్ లుక్ లీక్..

Agent

Agent Movie :  ఇటీవలే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ఫస్ట్ టైం హిట్ కొట్టాడు అఖిల్. ఈ సినిమా రిలీజ్ కి ముందే డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ సినిమాని అనౌన్స్ చేసాడు అఖిల్. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో హై లెవెల్ లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ప్రమోషన్స్, సక్సెస్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ‘ఏజెంట్’ షూటింగ్ మొదలు పెట్టినట్టు, త్వరలోనే అఖిల్ ఈ షూట్ లో జాయిన్ అవ్వనున్నట్టు సమాచారం.

Allu Arjun-Trivikram : త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ నాలుగోసారి.. ‘అల వైకుంఠపురంలో’ సీక్వెల్??

ఈ సినిమాని హై లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. కుదిరితే పాన్ ఇండియా సినిమాగా కూడా రిలీజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం బుడాపెస్ట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. విలన్ కి సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ కి విలన్ గా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ని సెలెక్ట్ చేశారు. ఇందులో మమ్ముట్టిని చాలా స్టైలిష్ గా చూపించబోతున్నారు. షూటింగ్ లో మమ్ముట్టి లుక్ లీక్ అయింది. ఈ లుక్ చూసి మమ్ముట్టి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుంటే అఖిల్ అభిమానులు విలన్ ని ఇంత స్టైలిష్ గా చూపిస్తుంటే హీరోని ఇంకే లెవెల్ లో చూపిస్తారో అని ఆనందపడుతున్నారు.