ఐశ్వర్యా రాయ్ వాయిస్‌తో ‘మలెఫిసెంట్ : మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్’

ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ మెయిన్ లీడ్‌గా రూపొందిన ‘మలెఫిసెంట్ : మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్’ హిందీ వెర్షన్‌కు ఐశ్వర్యా రాయ్ బచ్చన్ డబ్బింగ్..

  • Published By: sekhar ,Published On : October 3, 2019 / 07:48 AM IST
ఐశ్వర్యా రాయ్ వాయిస్‌తో ‘మలెఫిసెంట్ : మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్’

ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ మెయిన్ లీడ్‌గా రూపొందిన ‘మలెఫిసెంట్ : మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్’ హిందీ వెర్షన్‌కు ఐశ్వర్యా రాయ్ బచ్చన్ డబ్బింగ్..

ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ మెయిన్ లీడ్‌గా డిస్నీ సంస్థ, జోచిమ్ రోనింగ్ దర్శకత్వంలో.. ‘మలెఫిసెంట్ : మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్’ అనే సినిమా తెరకెక్కించింది. 2014 జోలీ నటించిన ‘మలెఫిసెంట్’ మూవీకి సీక్వెల్ ఇది. ‘మలెఫిసెంట్ : మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్’ లో ఏంజెలీనా మలెఫిసెంట్ అనే దుష్ట జీవి క్యారెక్టర్‌లో నటిస్తుంది. 

ఈ సినిమా హిందీలో కూడా విడుదలవుతోంది. హిందీ వెర్షన్‌కు ఐశ్వర్యా రాయ్ బచ్చన్.. ఏంజెలీనా క్యారెక్టర్‌కు వాయిస్ ఇవ్వడం విశేషం.. రీసెంట్‌గా హిందీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఐశ్వర్యా రాయ్ డబ్బింగ్ చెప్పిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

Read Also : అల్లు అర్జున్ కొత్త ఇల్లు – ‘బ్లెస్సింగ్’

ట్రైలర్‌లో ఐశ్వర్యా రాయ్ బ్లాక్ డ్రెస్‌లో కనిపించి.. సినిమాలో ఏంజెలీనా క్యారెక్టర్ టైపులో తన కోపాన్నీ, ద్వేషాన్నీ చూపిస్తానంటూ భయపెట్టింది. అక్టోబర్ 18న ‘మలెఫిసెంట్ : మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్’ రిలీజ్ కానుంది.