Mallika Sherawat : నడుము మీద చపాతీ వేడి చేస్తామన్నారు.. అందుకే రిజెక్ట్ చేశా

మల్లికా మాట్లాడుతూ.. ఒక నిర్మాత నా దగ్గరికి వచ్చి హాట్‌ ఐటెం సాంగ్ ఉందని చెప్పారు. ఇది ఎలా ఉండాలంటే చూసే ప్రేక్షకులకు మీరెంత హాట్‌ అనేది అర్థమవ్వాలన్నారు. నేను ఓకే చెప్పి దానికోసం

Mallika Sherawat : నడుము మీద చపాతీ వేడి చేస్తామన్నారు.. అందుకే రిజెక్ట్ చేశా

Mallika

Mallika Sherawat :  బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మల్లికా శెరావత్ తన సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ‘ఖ్వాహిష్‌’ సినిమాతో కెరీర్‌ స్టార్ట్ చేసిన మల్లికా ‘మర్డర్‌’ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్నుంచి ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్స్ చేసింది. ఐటెం సాంగ్స్ కూడా చాలా చేసింది. దీంతో మల్లికా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ గా ఫిక్స్ చేసేశారు. సినిమా కోసం ఎంతవరకైనా రొమాన్స్ చేయడానికి సిద్ధం ఈ భామ. కానీ తనకి నచ్చకపోతే అది మాములు సీన్ అయినా చేయదు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన మల్లికా శెరావత్ తను గతంలో ఓ ఐటం సాంగ్‌ను రిజెక్ట్‌ చేసానంటూ, ఎందుకు రిజెక్ట్ చేసిందో కూడా చెప్పింది.

Vishnupriya : నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోబోతున్న విష్ణుప్రియ?

మల్లికా మాట్లాడుతూ.. ఒక నిర్మాత నా దగ్గరికి వచ్చి హాట్‌ ఐటెం సాంగ్ ఉందని చెప్పారు. ఇది ఎలా ఉండాలంటే చూసే ప్రేక్షకులకు మీరెంత హాట్‌ అనేది అర్థమవ్వాలన్నారు. నేను ఓకే చెప్పి దానికోసం మీరు ఎలా చూపిస్తున్నారు అని అడిగాను. ఇందుకోసం నా నడుము మీద చపాతీలు వేడి చేస్తానన్నారు. నేను వెంటనే ఆశ్చర్యపోయి ఆ పాట చేయను అని చెప్పేశాను. వినడానికి మాత్రం ఇది చాలా ఫన్నీగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ అలంటి సీన్స్ నాకు ఎదురుపడలేదు అంటూ నవ్వేసింది మల్లికా.

Brahmanandam : కేసిఆర్ కోసం కామెడీ పక్కన పెట్టాను : బ్రహ్మానందం

అసలు భారత్‌లో హాట్‌ అనే పదానికి అర్థం ఏంటో నాకు తెలియట్లేదు. కానీ ఇక్కడ స్త్రీలకు హాట్‌నెస్‌ అంటేనే అదేదో బూతు అన్నట్లుగా ఆలోచిస్తారు. మొదట్లో ఈ ఆలోచన ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడిప్పుడు పరిస్థితులు కొంత మెరుగవుతున్నాయి అంటూ మల్లికా శెరావత్ తెలిపింది.