The Kerala Story : కేరళ స్టోరీకి ఓకే చెప్పిన మోదీ.. నిషేధించిన దీదీ..

వివాదాల మధ్య రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమాకి ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఓకే చెప్పగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం..

The Kerala Story : కేరళ స్టోరీకి ఓకే చెప్పిన మోదీ.. నిషేధించిన దీదీ..

Mamata Banerjee ban The Kerala Story movie in west bengal

The Kerala Story : అదా శర్మ (Adah Sharma) మెయిన్ లీడ్ లో నటించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’. కేరళలోని (Kerala) అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ చుట్టూ ఎన్నో వివాదాలు అలుముకున్నాయి. ఈ సినిమాని రిలీజ్ చేయకూడదంటూ నిరసనలు కూడా వెల్లువెత్తాయి. అయితే కోర్ట్ నుంచి చిత్ర రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ రావడం, ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడడంతో మూవీ థియేటర్ లోకి మే 5న వచ్చేసింది.

The Kerala Story : పొలిటికల్ హీట్ పెంచుతున్న ‘ది కేరళ స్టోరీ’

అయితే నిరసనలు వల్ల కొన్ని థియేటర్స్ లో ఈ సినిమాని నిలిపివేశారు. ఇక దేశంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ సినిమాని నిషేధించింది. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కేరళ స్టోరీ ప్రదర్శన నిలిపివేయాలంటూ ఉత్తర్వూలు జారీ చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సినిమా వివాదాస్పదం అయ్యిందని, ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రంలో అటువంటి అల్లర్లు జరగకుండానే సినిమాని నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

The Kerala Story : ది కేరళ స్టోరీ.. మరో కశ్మీర్ ఫైల్స్ కానుందా?

ఇక మోదీ ఓకే చెప్పిన కేరళ స్టోరీని మమతా బెనర్జీ నిషేధించడం చర్చనీయాంశం అయ్యింది. ఇది ఇలా ఉంటే, ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంటుంది. ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3 రోజుల్లో 35.25 కోట్ల కలెక్షన్స్ అందుకొని రికార్డు సృష్టిస్తుంది. కేవలం కొన్ని థియేటర్ లోనే రిలీజ్ అయిన ఈ చిత్రం ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడంతో మూవీ టీం ఫుల్ హ్యాపీలో ఉంది. మరి పూర్తి రన్ లో ఈ చిత్రం ఎటువంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.