Unstoppable with NBK: మాన్ ఆఫ్ మాసెస్.. రియలిస్టిక్ బిహేవియర్.. అందుకే హిట్!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సెన్సేషనే, ఒక పక్క సినిమా హీరోగా సినిమాలు చేస్తున్నారు. మరో పక్క పొలిటికల్ లీడర్ గా సేవ చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లో, నాన్ స్టాప్ గా..

Unstoppable with NBK: మాన్ ఆఫ్ మాసెస్.. రియలిస్టిక్ బిహేవియర్.. అందుకే హిట్!

Unstoppable With Nbk

Unstoppable with NBK: నటసింహం నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సెన్సేషనే, ఒక పక్క సినిమా హీరోగా సినిమాలు చేస్తున్నారు. మరో పక్క పొలిటికల్ లీడర్ గా సేవ చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లో, నాన్ స్టాప్ గా వర్క్ చేస్తూ అన్ స్టాపబుల్ టాక్ షో ను హోస్ట్ చేస్తున్నారు. హార్డ్ వర్క్, రియలిస్టిక్ బిహేవియర్, సెన్సాఫ్ హ్యూమర్ తో సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారు.

Devi Sri Prasad: రఫ్పాడిస్తున్న రాక్ స్టార్.. డిఎస్పి బౌన్స్ బ్యాక్ అయినట్లేనా?

మాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. మాటల్లో ఫిల్టర్ ఉండదు. సరదాలో స్టాప్ ఉండదు. సై అంటే సై, నై అంటే నై వన్స్ హీ స్టెపిన్. హిస్టరీ క్రియేట్. అన్నట్టుగా అన్ స్టపబుల్ టాక్ షోను ఇండియాలోనే నెం.1 టాక్ షోగా నిలబెట్టారు. నవంబర్ 4న ఆహా ఓటిటిలో బాలయ్య బాబు హోస్ట్ గా అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ఫస్ట్ ఎపిసోడ్ మోహన్ బాబు గెస్ట్ అప్పీయరెన్స్ తో మొదలైంది. ఫస్ట్ ఎపీసోడ్ లోనే బాలకృష్ణ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నారు. అదే ఉత్సాహంతో వ్యూయర్స్ ని పెంచుకుంటూ అన్ స్టాపబుల్ గా అలరిస్తున్నారు.

Summer Releases: స్టార్లంతా సమ్మర్ బరిలోనే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా!

బాలకృష్ణ సెకెండ్ ఎపీసోడ్ కి గెస్ట్ సెల్ఫ్ మేడ్ కి సర్ నేమ్ నాచురల్ స్టార్ నాని. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తో నవ్వుల పువ్వులు పూయించాడు. థర్డ్ ఎపీసోడ్ లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, అనిల్ రావిపూడి జోడి. వాళ్లతో బాలయ్య బాబు చేసిన అల్లరి నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత. ఫోర్త్ ఎపీసోడ్ లో అఖండ టీమ్ నే దించి వాళ్లతో ఆడి పాడి ఆకట్టుకున్నారు.

Pushpa: శ్రీవల్లి పాటకి ప్రధాని నరేంద్ర మోడీ స్టెప్పులేస్తే?!

ఎపీసోడ్ 5లో సినీ శిల్పి జక్కన్నను, స్వరవాణి కీరవాణిని తీసుకొచ్చి, వాళ్ల తో మాట్లాడిన తీరు వరల్డ్ వైడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సిక్స్త్ ఎపీసోడ్ లో పుష్ప టీమ్ ను తీసుకొచ్చి రచ్చ చేశాడు. ఎపీసోడ్ 7లో క్రాక్ టీమ్, 8లో రానా, ఎపీసోడ్ 9లో లైగర్ టీమ్ తో సందడి చేశాడు. జనవరి 28న బెస్ట్ ఆఫ్ సీజన్ 1 స్పెషల్ ఎపీసోడ్ తో అన్ స్టపబుల్ గా అలరించబోతున్నారు. అంతేనా ఫిబ్రవరి ఫోర్త్ న ప్రిన్స్ మహేష్ బాబు తో సీజన్ 1 ఫైనల్ ఎపీసోడ్ స్ట్రీమింగ్ చేయనుంది ఆహా. ఆరోజే సీజన్ 2 ఉంటుందా? లేదా? ఉంటే ఎవరితో ఉంటుంది.. లాంటి విషయాలు తెలుపనున్నారు.