Manchu Lakshmi : తెలంగాణాలో 50 స్కూళ్లని దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

తెలంగాణ నిర్వహిస్తున్న మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 గవర్నమెంట్‌ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని..........

Manchu Lakshmi : తెలంగాణాలో 50 స్కూళ్లని దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

Manchu Lakshmi :  మంచు లక్ష్మి స్పీచ్ లతో ఎంత ట్రోల్ అయినా తన క్యారెక్టర్స్ తో, తన మంచి మనసుతో అందర్నీ మెప్పిస్తునే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తుంది మంచు లక్ష్మి. అలాగే టెక్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమంతో టీచర్స్ లేని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు చెప్పేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. తాజాగా మరో మంచి పనికి సిద్ధమైంది మంచు లక్ష్మి.

Malavika Mohanan: ప్రభాస్‌పైనే ఆశలు పెట్టుకున్న బ్యూటీ..!

తెలంగాణ నిర్వహిస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 గవర్నమెంట్‌ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంచు లక్ష్మి తన టెక్ ఫర్ చేంజ్ సంస్థతోనే 50 స్కూళ్లు దత్తత తీసుకుంటానని ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా స్మార్ట్‌ క్లాసెస్‌ ప్రారంభిస్తామని, 1 నుంచి 5 తరగతుల వరకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్‌ క్లాసెస్‌ నిర్వహిస్తూనే, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని, ఆ స్కూల్స్ లో కనీస అవసరాలు ఏర్పాటు చేస్తామని మంచు లక్ష్మి తెలిపింది. మంచు లక్ష్మి చేసిన ఈ పనిని అంతా అభినందిస్తున్నారు.

Manchu Lakshmi Tech For Change