Manchu Manoj – Bhuma Mounika : పొలిటికల్ ఎంట్రీ పై భూమా రియాక్షన్.. మనోజ్ సపోర్ట్ ఇస్తాడా?
మనోజ్ భూమా మౌనికని పెళ్లి చేసుకుంటున్నాడని తెలియగానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అనే సందేహాలు మొదలయ్యి. తాజాగా ఈ పొలిటికల్ మ్యాటర్ గురించి మనోజ్ మాట్లాడాడు.

Manchu Manoj and Bhuma Mounika comments on political entry
Manchu Manoj – Bhuma Mounika : మంచు మనోజ్ ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వార్త సినీ, రాజకీయ రంగంలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇక పెళ్ళికి ముందు మనోజ్ సినిమాలు కూడా ఆపేయడంతో ఏపీలో ఒక వార్త గట్టిగా వినిపించింది. మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందుకోసమే ఈ వివాహం అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
Manchu Manoj : రామ్‌చరణ్ అతిధిగా వచ్చిన సినిమా ఆగిపోయింది.. ఆ దర్శకుడు వైష్ణవ్ తేజ్‌తో!
ఇటీవలే మూడు సినిమాలు ఒకే చేసి మళ్ళీ నటుడిగా బిజీ అవుతున్నాడు. అయితే మనోజ్ భార్య మౌనిక పొలిటికల్ ఎంట్రీ మాత్రం పక్కా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మనోజ్ అండ్ మౌనిక వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న ఒక టాక్ షోకి గెస్ట్ గా వెళ్లారు. ఆ షోలో మౌనికని పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నించగా బదులిస్తూ.. “నిజం చెప్పాలి అంటే నేను రాజకీయాల్లోనే ఉన్నాను. నాకు జనాల్లో మమేకం అవ్వడం అంటే ఇష్టం. రాజకీయాలు అంటే మా కుటుంబానికి (భూమా) ఒక బాధ్యత. మా కుటుంబాన్ని నమ్ముకుని చాలా మంది ఉన్నారు. ఒకవేళ నా అవసరం ఉంది అనుకుంటే తప్పకుండా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను. మనోజ్ కూడా నాకెంతో సపోర్ట్ చేస్తుంటాడు” అంటూ చెప్పుకొచ్చింది.
Manchu Manoj – Bhuma Mounika : పెళ్లి కాకముందు మౌనికని మోహన్ బాబు అలా ట్రీట్ చేసేవారు.. ఇప్పుడు!
ఇక మనోజ్ సినిమాలు విషయానికి వస్తే.. ఇటీవల ‘వాట్ ది ఫిష్'(What the Fish) అనే ఓ సినిమాని ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమాని పట్టాలు ఎక్కించబోతున్నాడు. ఈ మూవీతో పాటు ‘మనం మనం బరంపురం’ అనే చిత్రాన్ని కూడా చేస్తున్నట్లు, ఇంకో సినిమా చర్చలో ఉన్నట్లు తెలియజేశాడు. కాగా మనోజ్ చివరిగా 2017లో ఒక్కడు మిగిలాడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ తరువాత రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అలరించాడు.