Manchu Manoj: బాలయ్య కూతురు బ్రాహ్మణిపై చేయి చేసుకున్న మంచు మనోజ్

ఆహా ఓటీటీలో ఫస్ట్ టైమ్ బాలయ్య హోస్ట్ చేసిన షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'..

Manchu Manoj: బాలయ్య కూతురు బ్రాహ్మణిపై చేయి చేసుకున్న మంచు మనోజ్

Balayya

Manchu Manoj: ఆహా ఓటీటీలో ఫస్ట్ టైమ్ బాలయ్య హోస్ట్ చేసిన షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’.. తొలిసారి హోస్ట్ అవతారం ఎత్తిన బాలకృష్ణ చాలా ఎనర్జిటిక్‌గా ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో దీపావళి సందర్భంగా ప్రసారం అయిన బాలకృష్ణ షోకి ఫస్ట్ గెస్ట్‌గా మోహన్ బాబు వచ్చారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు మోహన్‌బాబు తనదైన శైలిలో ఆసక్తికర సమాధానాలు చెప్పారు. మధ్య మధ్యలో మోహన్ బాబు కూడా బాలకృష్ణకు ప్రశ్నలు వేయగా.. ఆద్యంతం ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఈ షోలో సినిమాల గురించి ప్రశ్నించడంతో పాటు బాలయ్య.. మోహన్ బాబుల మధ్య పర్సనల్ విషయాల గురించి చర్చ జరిగింది.

ఈ సమయంలోనే మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ బాలయ్య కూతురు బ్రహ్మిణిపై చేయి చేసుకున్న ఘటనను గుర్తు చేసుకున్నారు ఇద్దరూ. చిన్నప్పుడు ఒకానొక సమయంలో మంచు మనోజ్ బ్రాహ్మణిని కొట్టాడని, ఆ సమయంలో బ్రాహ్మణి ఏడ్చుకుంటూ బాలయ్య భార్య వసుంధర దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. వెంటనే వసుంధర మనోజ్ కు వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా చెప్పారు.

అయితే, బ్రాహ్మణి.. మనోజ్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. గతంలో బ్రాహ్మణిని లేడీ సింగం అంటూ కూడా ఓసారి మంచు మనోజ్ ట్వీట్ చేశారు.